50ఏళ్లకే రూ. 4వేలు పెన్షన్

Pawan Kalyan,BC Declaration,Chandrababu,Jayaho BC,Janasena,TDP, Rs. 4000 pension, CM Jagan, YCP,Chandrababu, TDP, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News,AP Political News, AP Latest news and Updates
Pawan Kalyan,BC Declaration,Chandrababu,Jayaho BC,Janasena,TDP, Rs. 4000 pension, CM Jagan, YCP,Chandrababu, TDP, Pawan Kalyan, Janasena

ఏపీ వాసులకు టీడీపీ, జనసేన అధినేతలు వరాల జల్లు కురిపించారు. మంగళగిరిలో మంగళవారం సాయంత్రం జరిగిన జయహో బీసీ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు,  పవన్ కళ్యాణ్ కలిసి బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. 10 అంశాలతో డిక్లరేషన్ విడుదల చేసిన చంద్రబాబు, పవన్ .. ఏపీలో టీడీపీ,జనసేన కూటమి అధికారంలోకి వస్తే బీసీలకు 50ఏళ్లకే నెలకు రూ.4వేలు పెన్షన్ అందజేస్తామని ప్రకటించారు.

ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ గవర్నమెంటు బీసీలను పల్లకి మోసే వాళ్లుగా మాత్రమే చూస్తోందని .. బీసీలు అంటే పల్లకీ మోసే వాళ్లు కాదని..   బీసీలంటే సమాజానికి బ్యాక్ బోన్ లాంటి వాళ్లని చంద్రబాబు  తెలిపారు. తమ కూటమితో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. బీసీలకు నామినేటెడ్ పదవుల్లో ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తామని మాటిచ్చారు. బీసీ సబ్ ప్లాన్ ఒకటి ఏర్పాటు చేసి.. ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్ల కేటాయింపు చేస్తామని.. ఆ నిధుల్ని బీసీలకే వినియోగించడానికి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు వాగ్ధానం చేశారు .

బీసీ డిక్లరేషన్ లోని 10అంశాలలో  బీసీలకు 50ఏళ్లకే పెన్షన్ మొదటిది కాగా రెండోది  పెన్షన్‌ను రూ.4వేలకు పెంచుతూ నిర్ణయం. అలాగే మూడోది బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం కాగా..సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటును నాలుగో అంశంగా చేర్చారు.అలాగే బీసీ సబ్ ప్లాన్ తో 5 ఏళ్లలో రూ.1.5 లక్షల కోట్లు కేటాయింపు కాగా..సబ్ ప్లాన్ నిధులు బీసీలకే వినియోగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

బీసీ డిక్లరేషన్లో ఆరో అంశంగా స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం కాగా చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం తీర్మానాన్ని ఏడో అంశంగా చేర్చారు.అన్ని  సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఎనిమిదో అంశంగా మార్చిన కూటమి..కొన్ని బీసీ వర్గాలకు కో ఆప్షన్ సభ్యులుగా ఛాన్స్ ఇస్తామని ప్రకటించింది. అలాగే తొమ్మిదో అంశంగా జనాభా ప్రతిపాదికన కార్పొరేషన్ల ఏర్పాటు చేస్తామని.. జనాభా దామాషా ప్రకారం నిధుల కేటాయింపు ఉంటుందని చంద్రబాబు చెప్పారు.

చివరిగా బీసీల స్వయం ఉపాధికి రూ.10వేల కోట్లు కేటాయించి వాటిలో 5వేల కోట్లతో ఆదరణ పరికరాలకు కేటాయిస్తూ పదో అంశంగా చేర్చారు. మొత్తంగా బీసీలకు పెద్ద పీట వేస్తూ తీసుకున్న ఈ నిర్ణయాలతో బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

టీడీపీ, జనసేన కూటమి మంగళగిరిలో నిర్వహించిన జయహో బీసీ సభకు భారీ ఎత్తున బీసీ సంఘాల నాయకులు ,సామాన్యులు  హాజరయ్యారు.  ఈ సభలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమిని గెలిపించాల్సిన బాధ్యత బీసీలపై ఉందని చంద్రబాబు కోరారు.  బీసీలకు మేలు కలిగే 10అంశాలతో ఈ డిక్లరేషన్లో.. ఏపీలో 50ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి నెలకు రూ.4వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇవ్వడం హైలెట్ గా నిలిచింది.

జయహో బహిరంగ సభ వేదికపైనే వైసీపీ ఎమ్మెల్యే గుమ్మునూరి జయరాం తెలుగు పార్టీ కండువా కప్పుకున్నారు.  వైసీపీలో  స్వతంత్రమే లేదని ..ఇప్పుడు టీడీపీలో చేరడం తనకు .. ఓ చిన్నపిల్లాడు తప్పిపోయి తిరిగి సొంత ఇంటికి చేరుకున్నట్లుగా ఉందంటూ జయరాం ఈ సభలో చెప్పుకొచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =