వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నీసా (56) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఆమె తీవ్ర అస్వస్థతకు గురై, గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ఎమ్మెల్సీ కరీమున్నీసా భౌతికకాయానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. అనంతపురం ఆమె కుటుంబ సభ్యులను సీఎం వైఎస్ జగన్ పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకతోటి సుచరిత, వెల్లంపల్లి శ్రీనివాస్ సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కరీమున్నిసా భౌతికకాయానికి నివాళులర్పించారు.
వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీకోసం శ్రమించిన కరీమున్నీసాకు గత మార్చిలోనే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా సీఎం వైఎస్ జగన్ అవకాశం కల్పించారు. శుక్రవారం జరిగిన శాసనమండలి సమావేశాలకు కూడా ఆమె హాజరయ్యారు. సమావేశాల అనంతరం విజయవాడలోని నివాసానికి చేరుకున్న ఆమె, రాత్రి 11 గంటల సమయంలో ఛాతీనొప్పితో అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు వెంటనే హుటాహుటిన విజయవాడలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆమె కన్నుమూశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ