మంత్రులు, పార్టీ నేతలతో సీఎం కేసీఆర్‌ సమావేశం, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చ?

CM KCR Held Meeting with Ministers and Party Leaders over Selection Of MLC Candidates,TRS finds few takers for MLC polls,Surprises in TRS pick for six MLC seats,KCR Announces Names of 6 Candidates,CM KCR Holds Meeting with MInisters ,KCR Selection Of MLC Candidates,Selection Of MLC Candidates,mla quota mlc elections,mla quota mlc elections in telangana,TRS MLC candidates,CM KCR ,mango news

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించి 12 ఎమ్మెల్సీ స్థానాలకు డిసెంబర్ 10న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 16 నుంచి నవంబర్ 23 వ‌ర‌కు అభ్యర్థుల నుంచి నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం రాష్ట్ర మంత్రులు, ఇతర కీలక పార్టీ నేతలతో ప్రగతి భవన్‌ లో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుని, నేడో, రేపో పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

తెలంగాణలో ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీ స్థానం, కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక నామినేషన్ల పరిశీలన నవంబర్ 24న చేపట్టనుండగా, ఉపసంహరణకు నవంబర్ 26 వరకు అవకాశమిచ్చారు. ఇక డిసెంబర్ 10వ తేదీన ఉదయం 08:00 నుంచి సాయంత్రం 04:00 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 15 =