రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడదు, ఉచిత విద్యుత్ పై సీఎం జగన్ సమీక్ష

AP CM YS Jagan, AP Electricity Department, AP Govt Free Power Scheme, free electricity scheme, free electricity scheme in ap, Free Power, Free Power In AP, Free power scheme for farmers, Free Power Scheme of Farmers, YS Jagan Review over Electricity Department, YS Jagan reviews on free electricity scheme

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి సోమవారం నాడు విద్యుత్‌ శాఖ, వైఎస్ఆర్‌ ఉచిత విద్యుత్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, వ్యవసాయ మోటర్లకు మీటర్లు అమర్చడం వలన రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడదని, వారికి ఇంకా నాణ్యమైన విద్యుత్‌ అందుతుందని చెప్పారు. ఈ విషయంపై రైతులకు అవగాహనా కల్పించాలని అధికారులకు సూచించారు.

మీటర్లు ఏర్పాటుతో ప్రతి 15 నిమిషాలకు ఒకసారి విద్యుత్‌ సరఫరాను తెలుసుకునే వీలుంటుందని, దీనివల్ల ఎలాంటి అంతరాయం లేకుండా 9 గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేయవచ్చుని చెప్పారు. మీటర్ల ద్వారా వచ్చే విద్యుత్‌ బిల్లు మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని, అనంతరం రైతులు అదే నగదును విద్యుత్‌ బిల్లు కింద డిస్కమ్‌లకు చెల్లించాలని పేర్కొన్నారు. రైతుల్లో అపోహలకు తావు లేకుండా జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి కమిటీలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu