త్వరలో విశాఖలో బీఆర్‌ఎస్‌ రెండో బహిరంగ సభ – పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ కీలక ప్రకటన

BRS AP President Thota Chandrasekhar Announces Party's Second Public Meeting to be Held at Vizag in Soon,BRS AP President, Thota Chandrasekhar Announces, Party's Second Public Meeting,Held at Vizag in Soon,Mango News,Mango News,Mango News Telugu,BRS Party Public Meeting,BRS Party Khammam Public Meeting,CM Kejriwal,CM Vijayan,CM Bhagwantman,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

బుధవారం ఖమ్మంలో నిర్వహించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీ తొలి బహిరంగ సభకు పలువురు జాతీయ నేతలు రావడం, ప్రజలు కూడా భారీగా హాజరవడంతో ఆ పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. ఇదే క్రమంలో మరో బహిరంగ సభ నిర్వహించడానికి ప్రణాళికలు వేస్తోంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరమైన విశాఖపట్నంలో త్వరలోనే బీఆర్‌ఎస్‌ రెండో బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ మేరకు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ వెల్లడించారు. బుధవారం ఖమ్మం సభకు హాజరైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే వైజాగ్‌లో బీఆర్‌ఎస్ బహిరంగ సభను నిర్వహించనున్నామని, ఈ సభకు పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, సభ నిర్వహణ తేదీ వంటివి త్వరలోనే వెల్లడిస్తామని ఆయన చెప్పారు.

ఇక కేసీఆర్‌ నాయకత్వంలో బీఆర్‌ఎస్‌ భారత రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టిస్తుందని, తెలంగాణలోని రైతు సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయడమే తమ నాయకుడి అభిమతమని చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయిన నాటినుంచి తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఏపీలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా మారిందని తెలిపారు. ఏపీలో అభివృద్ధి శూన్యమని, రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లవుతున్నా.. ఇప్పటికీ రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ మోడల్ ఏపీకి అవసరమని, అది సీఎం కేసీఆర్ వల్లనే సాధ్యమని తోట చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు తనపై చేసిన ఆరోపణలపై స్పందించిన చంద్రశేఖర్‌.. ఖమ్మం సభనుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రఘునందన్‌ రావు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఆయన పేర్కొన్న భూములను సర్వే చేయాలని, ఒకవేళ అందులో తన పేరు మీద భూమి ఉన్నదని తేలితే, దానిలో 90 శాతం భూమి రఘునందన్‌ రావు తీసుకోవచ్చని మిగిలినది తనకు ఇస్తే చాలని స్పష్టం అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 2 =