కరోనా వ్యాప్తి నేపథ్యంలో జూలై 5 వరకు గుంటూరు మిర్చి యార్డ్‌ మూసివేత

Andhra Pradesh, Andhra Pradesh Latest News, AP Govt, Corona Effect, Guntur, Guntur Coronavirus, Guntur Mirchi Yard, Guntur Mirchi Yard Closed, Guntur Mirchi Yard will be Closed, Guntur Mirchi Yard will be Closed Up To July 5th

జిల్లాలో రోజురోజుకి కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో గుంటూరు మిర్చి యార్డ్‌ ను మూసివేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై 5 వరకు మిర్చి యార్డ్‌ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగానే మిర్చి యార్డ్‌ను మూసేస్తున్నామని, తిరిగి జూలై 6 వ తేదీన యార్డ్‌ ప్రారంభించనున్నట్లు యార్డ్‌ ఛైర్మన్‌ తెలియజేశారు. మరోవైపు ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 12285 కు చేరింది. గుంటూరులో ఇప్పటికి 1103 కేసులు నమోదు కాగా, 538 మంది కోలుకున్నారు, 548 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కాగా ఈ వైరస్ వలన జిల్లాలో 17 మంది మృతి చెందారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu