కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ విధించడం వలన వివిధ రాష్ట్రాల్లో ఉండిపోయిన ప్రజలను ఏపీకి తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి ఏపీకి మే 16 నుండి బస్సులు నడిపేందుకు ప్రభుత్వం ముందుగా సిద్ధమైంది. అయితే హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లాల్సిన ప్రత్యేక బస్సులు ఏర్పాటును తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. తిరిగి మళ్ళీ బస్సులు ఎప్పటినుంచి నడుపుతామనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని ఆర్జీసీ అధికారులు తెలిపారు. సుమారు 13 వేల మందిని ఏపీకి తరలించాల్సి ఉండగా ప్రత్యేక బస్సులు వాయిదా పడడంతో వారు మరికొన్నాళ్లు వేచిచూడాల్సి ఉంది.
ముందుగా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించే వారికే ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్రయాణానికి అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే వారి స్వస్థలాలకు చేరుకున్నాక సంబంధిత జిల్లాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ లో ఉంటామని అంగీకారం తెలిపితేనే ఈ బస్సుల్లో ప్రయాణానికి టికెట్లు జారీ చేస్తామని, ఈ నిబంధనలకు అనుగుణంగానే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu