ఆఫ్ఘానిస్థాన్‌లో చిక్కుకున్న ఏపీ కార్మికుల కోసం హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు

AP Govt Set Up Help Desk for AP People who are Stuck in Afghanistan

తాలిబన్లు ఆఫ్ఘానిస్తాన్ దేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆఫ్ఘానిస్థాన్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కార్మికులు ఎవరైనా ఉంటే వారిని సురక్షితంగా స్వస్థలానికి తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో హెల్ప్‌డెస్క్‌ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు కార్మికశాఖ కమిషనర్‌ రేఖారాణి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆఫ్ఘానిస్తాన్ లో ఉన్న కార్మికులు గాని, వారికి సంబంధించిన వారు గాని ఆ వివరాలను టోల్ ఫ్రీ నంబర్ 0866-2436314 కు లేదా 91-7780339884 (నానాజీరావు-సహాయ కార్మిక కమిషనర్) లేదా +919492555089 (శ్రీమన్నారాయణ-సహాయ కార్మిక కమిషనర్) నంబర్లకు ఫోన్ చేసి చెప్పాలని కార్మిక శాఖ ప్రకటనలో వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =