చివరి వరకూ అభ్యర్ధిపై రాని క్లారిటీ

Clarity That Does Not Come On The Chirala Candidate Till The End, Clarity That Does Not Come On The Chirala, Chirala Candidate Clarity, Chirala Candidate, Chirala TDP, Karanam Balram, MM Kondaiah, Chandrababu, Lokesh, TDP, Janasena, Congress, YCP, BJP, Pawan Kalyan, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Chirala TDP ,Karanam Balram, MM Kondaiah, Chandrababu, Lokesh, TDP, Janasena, Congress, YCP, BJP, Pawan Kalyan,

2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన  కరణం బలరాం వైసీపీకి జైకొట్టారు. ఆయన ప్లేస్‌లో కొత్త ఇన్‌ఛార్జిని టీడీపీ అధిష్ఠానం నియమించినా కూడా.. లోకేష్ కోటా అంటూ మంగళగిరి నుంచి మరో నాయకుడు ల్యాండ్‌ అయ్యారు.అయితే ఈ ఇద్దరే కాకుండా మరో ముగ్గురు కూడా తమ తమ ప్రయత్నాల్లో ఉన్నారు.

బాపట్ల జిల్లా పరిధిలోని చీరాల టీడీపీలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా కూడా  నేతల మధ్య ఆధిపత్య పోరు ఆనవాయితీగా వస్తూనే ఉంది. కరణం వైసీపీలోకి వెళ్లడంతో..రెండేళ్ళ క్రితం ఎంఎం కొండయ్యా ఇన్‌ఛార్జి బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఎన్నికల ముందు కొంతమంది నేతలు టికెట్లు ఆశిస్తున్నారు. ఇప్పటికే కొండయ్యకు పోటీగా మంగళగిరి నుంచి చేనేత వర్గానికి చెందిన తిరువీధుల శ్రీనివాసరావు పేరు వినిపిస్తోంది.

ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న చీరాలలో..ఆ పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నుంచి పదవులు పొందినవారంతా తర్వాత వైసీపీలో చేరారు. తొలిసారి 1985లో చీరాలలో టీడీపీ అభ్యర్ధిగా  గెలుపొందారు. అప్పటి నుంచి ఎనిమిది సార్లు ఎన్నికలు జరగగా.. నాలుగుసార్లు టీడీపీ విజయం సాధించింది. మూడుసార్లు కాంగ్రెస్, ఒకసారి నవోదయం పార్టీ  గెలిచింది. 2004 నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో కూడా  ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ  2019లో విజయాన్ని సాధించింది.

అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం వైసీపీలో చేరడంతో అతని వారసుడిగా కరణం వెంకటేష్‌ ..వైసీపీ అభ్యర్థిగా చీరాలలో పోటీ చేస్తున్నారు.ఇటు బీసీ కాన్సెప్ట్‌తో యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యాపార వేత్త ఎం.ఎం. కొండయ్యను రంగంలోకి దించారు చంద్రబాబు. మరోవైపు  మంగళగిరి బీసీ నేత తిరువీధుల శ్రీనివాసరావు చీరాల సీటును ఆశిస్తున్నారు.

చీరాలలో నేతలు పోటీ పడుతుండటంతో ఇన్‌ఛార్జి ఎం.ఎం. కొండయ్య పరిస్థితిపై అయోమయం నెలకొంది. 34 మందితో ప్రకటించిన సెకండ్‌ లిస్టులోనూ చీరాల ప్రస్తావన లేకపోవటంతో ఇంకా టెన్షన్ మొదలయిందట.  దీంతో చీరాలలో ఈ పరిస్థితి ఇప్పటిది కాదని .. మొదటి నుంచీ కూడా ఇక్కడ నిలబడే అభ్యర్థపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉండటం అలవాటేనని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =