కరోనా నేపథ్యంలో తిరుపతిలో ఆగస్టు 5 వరకు పూర్తి స్థాయి ఆంక్షలు

Complete Lockdown Restrictions will be Implemented in Tirupati, Corona Outbreak, Lockdown Restrictions will be Implemented in Tirupati, Tirumala Tirupati Devasthanam, Tirupati, Tirupati Implemented Lockdown Restrictions, Tirupati temple

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా తిరుపతిలో కరోనా ప్రభావం ఎక్కువవుతుంది. ఈ నేపథ్యంలో జూలై 21, మంగళవారం నుంచి ఆగస్టు 5, బుధవారం వరకు తిరుప‌తిలో పూర్తిస్థాయి ఆంక్ష‌లు విధిస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్ట‌ర్ నారాయణ భరత్ గుప్తా ప్ర‌క‌టించారు. ఈ ఆంక్షలు విధించే సమయంలో అత్య‌వ‌స‌ర సేవ‌లు, మెడిక‌ల్ షాపులకు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు.

ఇక మిగ‌తా అన్ని రకాల షాపులకు ఉద‌యం 6 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇస్తున్నట్టు తెలిపారు. ఉదయం 11 తర్వాత వాహ‌నాల‌ తిరగడాన్ని కూడా నిషేదిస్తునట్టు పేర్కొన్నారు. జిల్లాలో క‌రోనా వ్యాప్తి పెరుగుతుండడంతో ప్రజలంతా నిబంధ‌న‌లు పాటించి, అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు. మరోవైపు జూలై 20 నాటికీ చిత్తూరు జిల్లాలో 4763 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 1580 మంది కోలుకోగా, 51 మంది మరణించారు. ప్రస్తుతం 3132 మంది చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu