ఎంపీగా, ఎమ్మెల్యేగానూ బరిలో దిగుతారా?

Pawan Kalyan, Pawan political plan, Pawan contest as MP, Pawan contest as MLA,win,YS Jagan, Chandrababu, YCP, TDP, Jana Sena, TDP - Jana Sena alliance,AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
Pawan Kalyan, Pawan political plan, Pawan contest as MP, Pawan contest as MLA,win,YS Jagan, Chandrababu, YCP, TDP, Jana Sena, TDP - Jana Sena alliance

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నా కూడా  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా తాను ఎక్కడ నుంచి బరిలో దిగుతారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయంపై రకరకాల ఊహాగానాలు తెరమీదకు వస్తున్నాయి.  అయితే ఇప్పటి వరకూ పవన్ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని వార్తలు వినిపించగా.. ఇప్పుడు ఆయన ఎంపీగా బరిలో దిగబోతున్నారని  ప్రచారం జరుగుతోంది. అయితే ఏదో ఒకటి కాకుండా ఎంపీగా, ఎమ్మెల్యేగానూ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారన్న వార్తలు జోరందుకున్నాయి.

ఎంపీ, ఎమ్మెల్యే రెండు సీట్లకు పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వల్ల 2024 ఎన్నికల ఫలితాల తర్వాత పవన్.. రాజకీయ భవిష్యత్తును తిరుగులేనిదిగా మలుచుకోవాలనే పక్కా ప్రణాళిక ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  పవన్  ఎంపీగా  గెలిస్తే..అటు కేంద్రంలో మూడోసారి బీజెపీ  అధికారంలోకి వస్తే పవన్  కచ్చితంగా కేంద్రంలో మంత్రి అవుతారు. అలాగే ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడితే.. టీడీపీ, జనసేన కూటమి అధికారం సాధించగలిగితే ఏపీ గవర్నమెంటులో అతి ముఖ్య భూమికను పవన్ పోషించగలుగుతారు.

ఒకవేళ టీడీపీ, జనసేన కూటమికి ఏపీలో అధికారంలోకి రాకపోయినా కూడా ఎంపీగా గెలిస్తే మాత్రం.. కేంద్రంలో మంత్రిగా ఉండటం వల్ల జనసేన పార్టీ అధికారం కోల్పోకుండా ఉంటుంది.  బీజేపీ అధినాయకత్వమే  పవన్ కు ఈ సలహాను ఇచ్చిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.  పవన్ ను ఎంపీగా పోటీ చేయమని బీజేపీ కోరిందట. అలాగే టీడీపీతో కూటమిగా ముందుకు వెళుతుండటంతో..పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయలేకపోతే పార్టీ శ్రేణుల్లో జోష్ తగ్గిపోతుంది. అందుకే పవన్ ఎంపీగానూ, ఎమ్మెల్యేగానూ పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

టీడీపీని  40 సీట్లు ఇమ్మని అడిగినా.. చంద్రబాబు  24 సీట్లు మాత్రమే ఇవ్వడానికి పవన్‌ను ఒప్పించారు. అయితే ఈ 24 సీట్లు అయినా  గెలిపించుకొని ..తను మంత్రి కావాలన్న ఆలోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ నిజంగా కనుక పవన్ ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కచ్చితంగా అది రాజకీయ వ్యూహమేనని విశ్లేషకులు చెబుతున్నారు. దీనివల్ల జనసేన పార్టీకి ఒక స్టాండ్ లభిస్తుందని అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 12 =