ఏపీలో 29 లక్షలు దాటిన కరోనా పరీక్షలు, ఇన్ఫెక్షన్ రేటు 10.21 శాతం

Andhra Pradesh, ap corona tests, AP Coronavirus, AP Coronavirus Highlights, AP Tests More than 26 Lakhs Samples, Corona Testing, Corona Testing in AP, Coronavirus, Coronavirus Live Updates, COVID-19

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా పెద్దఎత్తున కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆగస్టు 17, సోమవారం ఉదయం 10 గంటల నాటికీ 29,05,521 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు. ఆగస్టు 16-ఆగస్టు 17 (9AM-9AM) వరకు 24 గంటల వ్యవధిలో 44,578 శాంపిల్స్ (విఆర్డీఎల్+ట్రూనాట్+నాకో(25114), ర్యాపిడ్ యాంటిజెన్ -19464) ను పరీక్షించినట్టు తెలిపారు. దేశంలో అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహించిన రాష్ట్రాల్లో ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర మొదటి మూడు స్థానాల్లో ఉండగా ఆంధప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది. కాగా రాష్ట్రంలో ఇన్ఫెక్షన్ రేటు 10.21 శాతం, రికవరీ రేటు 70.50 శాతం, మరణాల రేటు 0.92 శాతంగా ఉంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu