రేషన్ డీలర్లు బంద్ చేస్తే పంపిణీ ఆగిపోదు – ఏపీ పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని

AP Civil Supplies Minister, AP Civil Supplies Minister Kodali Nani, AP Civil Supplies Minister Kodali Nani Responds over Ration Dealers Issue, Kodali Nani, Kodali Nani Responds over Ration Dealers Issue, Mango News, Minister Kodali Nani Clarity on Ration Dealers Bandh, Minister Kodali Nani gives clarity over ration distribution in AP, Ration Dealers Bandh, Ration Dealers Bandh In AP, Ration Dealers in Andhra Pradesh, Ration Dealers Issue

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ సమస్యలు విషయంలో రేషన్ డీలర్ల సంఘం పోరుబాట పట్టనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రేషన్ డీలర్లు బంద్ చేసినంత మాత్రాన రేషన్ ఆగిపోదని, గోదాముల నుంచి వాహనాల ద్వారా సరకులను తెచ్చి ప్రజల ఇళ్లవద్దనే సరఫరా చేయిస్తామని చెప్పారు. బైపాస్ పద్దతిలో రేషన్ పంపిణీ చేస్తామని, డీలర్లకు ఏవైనా సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి గాని ఇలా చేయడం సరికాదన్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి రేషన్ యథావిధిగా పంపిణీ చేస్తామని, ఎవరు అడ్డం పడినా సరఫరా అయితే ఆగదని పేర్కొన్నారు. రేషన్ డీలర్ల తీరు, భాష మార్చుకోవాలని, బెదిరింపులకు ప్రభుత్వం భయపడేది లేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =