ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 24, శుక్రవారం ఉదయం 10 గంటల నాటికీ 15,41,993 కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. కాగా గత మూడురోజుల్లోనే 155719 పరీక్షల నిర్వహించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 80,858 పాజిటివ్ కేసుల్లో గత 19 రోజుల్లోనే 62,161 కేసులు నమోదయ్యాయని తెలిపారు.
రాష్ట్రంలో కరోనా పరీక్షల వివరాలు:
- జూన్ 11 నాటికీ 5,10,318 కరోనా పరీక్షలు నిర్వహించగా 5429 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
- జూలై 5 నాటికీ 10,17,140 కరోనా పరీక్షలు నిర్వహించగా 18697 (5429+13268) మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
- జూలై 24 నాటికీ 15,41,993 కరోనా పరీక్షలు నిర్వహించగా 80,858 (5429+13268+62161) మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఏపీలో కరోనా వివరాలు:( ఇతర రాష్ట్రాలు, విదేశాలు నుంచి వచ్చిన వారితో కలిపి)
- జూలై 24 నాటికీ నిర్వహించిన కరోనా పరీక్షలు: 15,41,993
- నెగటివ్ వచ్చిన వారు – 14,61,135
- పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య: 80,858
- మొత్తం యాక్టీవ్ కేసులు – 39990
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య – 39935
- కరోనా మరణాలు – 933
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu