కృష్ణాజిల్లా జగ్గయ్యపేట సమీపంలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా, 30 మందికి గాయాలు

Private Travels Bus Accident at Jaggayyapeta,30 People Injured,Vijayawada Bus Accident,Krishna District,Jaggayyapeta Accident,AP News,Vijayawada,Private Travels Bus Overturns At Vijayawada,30 Injured,Vijayawada Bus Accident 30 People Injured,Mango News,Mango News Telugu,Private Travels Bus Accident,Private Travels Bus Accident at Vijayawada,Jaggayyapeta Bus Accident,Andhra Pradesh Bus Accident,Andhra Pradesh,Road Accident,Private Travels Bus Accident News,Jaggayyapeta Accident,Jaggayyapeta Accident News,Accident,Andhra Pradesh News,Jaggayyapeta Accident News

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని అనుమంచిపల్లి గ్రామ సమీపంలో జాతీయరహదారిపై వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో 30 మందికి గాయాలు అయినట్టు తెలుస్తుంది. గాయపడిన వారందరిని స్థానిక జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను విశాఖపట్నం, ఒడిశాకు చెందిన వారుగా గుర్తించారు. మరోవైపు జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను బస్సు ప్రమాద విషయం తెలుసుకుని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని క్షతగాత్రులను పరామర్మించారు. వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యులకు సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 5 =