ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంత తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 84,502 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 14429 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. అనంతపూర్, చిత్తూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం, కర్నూల్, కృష్ణా వంటి 6 జిల్లాల్లో 1000కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మే 28, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,57,986 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 103 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 10634 కి పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 20746 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 14,66,990 కు చేరింది. అలాగే ప్రస్తుతం 1,80,362 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఇప్పటివరకు ఏపీలో మొత్తం 1,90,09,047 కరోనా పరీక్షలను నిర్వహించారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(14429):
- నెల్లూరు – 930
- తూర్పుగోదావరి – 2022
- గుంటూరు – 798
- విశాఖపట్నం – 1145
- శ్రీకాకుళం – 897
- చిత్తూరు – 2291
- కర్నూల్ – 1034
- విజయనగరం – 535
- ప్రకాశం – 924
- కడప – 578
- అనంతపూర్ – 1192
- కృష్ణా – 1092
- పశ్చిమగోదావరి – 991
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ