ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. దీంతో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 7813 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 7813 కేసులతో కలిపి జూలై 25, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 88671 కు చేరింది. గత 24 గంటల్లో(9AM-9AM) 53,681 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు.
ఇక రాష్ట్రంలో మరో 52 కరోనా మరణాలు నమోదయ్యాయి. కరోనా వలన గుంటూరులో తొమ్మిది మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనిమిది మంది, తూర్పుగోదావరి జిల్లాలో ఆరుగురు, కృష్ణాలో ఆరుగురు, కర్నూల్ లో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, విజయనగరంలో నలుగురు, శ్రీకాకుళంలో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, నెల్లూరులో ఒకరు, ప్రకాశంలో ఒకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 985 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో ఇప్పటికే 43255 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 44431 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu