ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతుండడంతో రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జూలై 25 ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 88671 కు చేరింది. పశ్చిమగోదావరి జిల్లాలో కూడా ఇప్పటివరకు 7553 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జిల్లాలోని ద్వారకా తిరుమల ఆలయం జూలై 31 వరకు మూసివేయనున్నారు. ద్వారకా తిరుమలలో జూలై 31 వరకు స్వామివారి దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో ప్రకటించారు. స్వామివారి నిత్యకైంకర్యాలు, ఇతర సేవలు యధావిధిగా కొనసాగుతాయని ఈవో వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu





































