సజ్జల సీటుపై సోషల్ మీడియాలో చర్చ

Debate On Social Media On Sajjala Ramakrishna Reddy Seat,Debate On Social Media,Sajjala Ramakrishna Reddy Seat,Sajjala Ramakrishna Reddy, AP Politics, Chandrababu, Debate on Sajjala seat,Jagan,TDP,YCP, YCP cadre,pawan kalyan,Pawan Kalyan,Chandrababu,AP Live Updates, AP Politics,TDP, Political News,Mango News, Mango News Telugu
AP Politics ,Debate on Sajjala seat,Sajjala Ramakrishna Reddy, Jagan, YCP, TDP, Chandrababu, YCP cadre

బండ్లు ఓడలు అవడం.. ఓడలు బండ్లు అవడం అనే సామెత సాధారణంగా అందరి జీవితాలకు వర్తిస్తుంది. ముఖ్యంగా ఈ తేడా రాజకీయాలలో ఇంకా ఎక్కువగా  కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.  ఇప్పుడు ఏపీలో వైఎస్సార్సీపీ నేతలను చూసిన వారంతా ఇదే మాట అంటున్నారు. ముఖ్యంగా వైసీపీ సీనియర్ నేత.. వైఎస్ భారతికి రైట్ హ్యాండ్‌గా చెప్పుకునే సజ్జల రామకృష్ణా రెడ్డి పరిస్థితి ఇదేనని అంటున్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంతా నా  ఇష్టం అన్న రీతిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరువాత నెంబర్ టూ గా చెలామణి అవడమే కాకుండా.. అన్ అఫీషియల్‌గా సకల శాఖామంత్రిగా పేరుపడిన సజ్జల రామకృష్ణారెడ్డి పరిస్థితి మరీ అయ్యో పాపం అనేటట్టుగా తయారయింది. ఏపీలో వైసీపీ  ఓటమి తరువాత  సజ్జల పెద్దగా కనిపించనే లేదు.

గురువారం అంటే జూన్ 20న మాజీ సీఎం  జగన్ నిర్వహించిన సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి  కనిపించినా,  ఎప్పుడూ ఉన్నట్లుగా ఆయన జగన్ పక్కన లేరు. కనీసం ఎదుట సీటులోనూ లేరు.  పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో..జగన్ పక్కన వేదిక మీద ఉండాల్సిన సజ్జల రామకృష్ణారెడ్డి సీటు కాస్తా  ఏకంగా అయిదవ బెంచ్‌లోకి వెళ్లిపోవడంతో సొంత పార్టీ నేతలు కూడా కంగుతిన్నారు.

దీంతో జగన్ దగ్గర సజ్జల ప్రాముఖ్యత తగ్గిందంటూ సోషల్ మీడియాలో వార్తలు షికార్లు కొడుతున్నాయి. లేదంటే  సజ్జల  కావాలని వెళ్ళి అక్కడ కూర్చున్నారా అంటూ వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ ఘోరంగా ఓడిపోయాక కానీ జగన్ కు సత్యం తెలిసి రాలేదని..అందుకే ఇప్పుడు పార్టీ కేడర్‌కి, లీడర్‌కి మధ్యన ఎవరూ ఉండకూడదనే  పార్టీ నాయకుల మాటను మన్నించి ఆయన్ని అలా వెనక్కి పంపించారన్న చర్చ కూడా జరుగుతోంది.

నిజానికి ఏపీలో వైసీపీ ఘోర పరాజయానికి సజ్జలదే బాధ్యత అనే వారే ఎక్కువ మంది ఉన్నారు.  అయితే, జగన్‌ను దగ్గరగా చూసిన వారితో పాటు, జగన్ మనస్తత్వం గురించి తెలిసిన వారు మాత్రం జగన్ వల్లే పార్టీకి ఇప్పుడు ఆ పరిస్థితి అంటున్నారు.  సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినా..వైవీ  సుబ్బారెడ్డి చెప్పినా  జగన్ చెప్పింది చేయడమే తప్ప తమ అభిప్రాయాన్ని జగన్ వద్ద చెప్పే స్వేచ్ఛను జగన్ ఇవ్వరని చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY