రెండు చోట్ల ఓటు వేస్తే ఏమవుతుందో తెలుసా?

Do You Know What Happens If You Vote In Two Places?, What Happens If You Vote In Two Places, If You Vote In Two Places, Do You Know What Happens, Two Places Vote, Election 2024, Lok Sabha Elections 2024, Voter ID, Two Votes, Two Votes, AP Elections 2024, Assembly Elections, Lok Sabha Elections, AP Live Updates, TS Live Updates, Political News, Mango News, Mango News Telugu
Election 2024,lok sabha elections 2024,voter id,two votes,two votes,ap elections 2024

భారతదేశంలో 2024 లోక్‌సభ ఎన్నికలలో మే 13న  4వ దశ ఓటింగ్  జరగనుంది.  10 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో  ఉన్న 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగబోతోంది. కానీ కొంత మందికి ..  రెండు  వేర్వేరు ప్రాంతాల్లో  రెండు ఓటరు కార్డులు ఉంటాయి. అయితే వాళ్లు  రెండు చోట్ల ఓటు హక్కును ఉపయోగించుకుంటే ఏమవుతుందని చాలామందికి అనుమానం ఉంటుంది.  కానీ వాళ్లు అలా  ఓటు వేయకూడదని ఈసీ అధికారులు చెబుతున్నారు.

నిజానికి భారతదేశంలో  మొత్తం జనాభా 140 కోట్లు దాటిపోయింది.కానీ  వీరిలో సుమారు 80% మంది ఓటు హక్కు కలిగి ఉన్నట్లు చెబుతున్నా.. గణాంకాల ప్రకారం మాత్రం.. 70% మంది మాత్రమే ఓటు హక్కును కలిగి ఉన్నారు. అయితే  ఈ సారి ఎన్నికలలో కొత్త ఓట్లు భారీగా చేరినా కూడా ఇంకా చాలామంది ఓటును వినియోగించుకోవడానికి ఆయుధం అయిన ఓటర్ కార్డు కోసం ప్రయత్నించడం లేదన్న వాదన వినిపిస్తోంది.

ఇక మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో  రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో చాలామంది ఓటర్లు  వారి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అయితే కొంత మంది ఓటర్లకు తమ పేర్లు రెండు వేర్వేరు ప్రాంతాల్లో.. రెండు ఓటరు కార్డులు ఉంటాయి.  నిజానికి ఒక వ్యక్తికి ఒకే ఓటరు కార్డు ఉంటుంది.

కానీ కొన్ని కారణాలతో  వేర్వేరు ప్రాంతాల్లో ఉండి ఓటరు కార్డు కోసం అప్లై చేస్తే..వాళ్లకు  రెండు ఓటరు కార్డులు ఉంటాయి. కానీ రెండు ఓటరు కార్డులు ఉన్నా కూడా  ఈసీ నిబంధనల ప్రకారం  ఒక చోట మాత్రమే ఉపయోగించుకోవాలి. అలా కాకుండా రెండు చోట్ల కూడా ఓటు వేస్తే చట్టరీత్యా నేరం అవుతుంది. అందుకే  రెండు ఓటరు కార్డులున్నవాళ్లు అందులో ఒక దానిని వినియోగించుకుని రెండోది రద్దు చేసుకోవాలి.

అంతేకాదు ఒక వ్యక్తికి రెండు ఓటరు కార్డులుంటే అది ఎన్నికల సంఘంలోని రూల్ నెంబర్ 17ను ఉల్లంఘించినట్లే.  చట్ట ప్రకారం వారికి ఏడాది పాటు జైలు శిక్ష విధించబడుతుంది. అందుకే  రెండు చోట్ల ఓటింగ్ కార్డులను కలిగి ఉన్నవాళ్లు చాలామంది ఒకదానిని రద్దు చేసుకున్నారు. అయితే ఇప్పటికీ ఇంకా పెండింగ్ ఉన్న వారు ఓటింగ్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY