ఏపీలో వినాయక చవితి నిర్వహణ, ఉత్సవాలపై ఎలాంటి ఆంక్షలు లేవు – డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి

AP No Police Restrictions on Vinayaka Chavithi Celebrations Confirms DGP KV Rajendranath Reddy, AP Police No Restrictions on Ganesh Puja, DGP Rajendranath Reddy Said No Restrictions on Vinayaka Chavathi, Mango News, Mango News Telugu, DGP Rajendranath Reddy, Andhra Pradesh Police , Vinayaka Chavithi Latest News And Updates, Vinayaka Chavithi Celebrations, KV Rajendranath Reddy IPS, KV Rajendranath Reddy News And Live UPdates, Andhra Pradesh, AP CM YS Jagan Mohan Reddy

ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి నిర్వహణ, ఉత్సవాలపై ఎలాంటి పోలీసు ఆంక్షలు లేవని స్పష్టం చేశారు ఆ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి. కాకపోతే భక్తులు ముందస్తు జాగ్రత్తలు పాటించి ఉత్సవాలు జరుపుకోవాలని రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు. కాగా కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి వేడుకల నిర్వహణపై ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితులు కుదుటపడిన ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో ఈసారి పెద్ద ఎత్తున వినాయక చవితి వేడుకల నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ నిర్వహకులు సన్నాహాలు చేసుకుంటున్నారు.

కానీ ఈ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించినట్లు తొలుత కొన్ని వార్తలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా దీనిపై పలువురు నిరసన తెలిపారు. దీంతో ప్రజల్లో ఏర్పడిన గందరగోళాన్ని తొలగిస్తూ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి స్వయంగా ఈ వార్తలపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఏపీలో వినాయక చవితి నిర్వహణ, ఉత్సవాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని ధృవీకరించారు. అలాగే గణేష్ విగ్రహాల నిమజ్జనంపై ప్రత్యేక ఆంక్షలు ఉండవని తెలిపారు. ప్రజలు ఎప్పటిలాగే భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునేందుకు పోలీసు శాఖ పూర్తిగా సహకరిస్తుందని ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులకు పలు సూచనలు ఇచ్చారు.

ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి చేసిన కొన్ని కీలక సూచనలు..

  • వినాయ‌క మండ‌పాలు ఏర్పాటు చేసుకునే వారు సంబంధిత పోలీస్ స్టేష‌న్‌లో ముందుగా స‌మాచారం ఇవ్వాలి. అలాగే నిబంధ‌న‌లకు అనుగుణంగా మండ‌పాలు ఏర్పాటు చేసుకోవాలి.
  • పోలీసు అధికారులు గణేష్ ఉత్సవ కమిటీలతో సమన్వయం చేసుకుని ఉత్సవాలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటారు.
  • ఉత్సవ కమిటీ సభ్యులు వారు ఏర్పాటు చేసే వేడుకల పందిళ్ల వద్ద స్వయంగా భద్రతా చర్యలు చేపట్టాలి.
  • పందిళ్లు, విగ్రహం ఎత్తు, పూజ, నిమజ్జనం జరిగే రోజులు, నిమజ్జనం జరిగే మార్గం, స్థలం గురించి భక్తులు పోలీసులకు తెలియజేయాలి, తద్వారా పోలీసులు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు.
  • మండపాల వద్ద ఉద‌యం 6 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు స్పీక‌ర్ల‌కు అనుమ‌తి ఉంటుంది.
  • అగ్నిమాపక, విద్యుత్తు శాఖ సూచనల మేరకు మండపాల వద్ద నీరు, ఇసుక వంటివి ఏర్పాటు చేసుకోవాలి.
  • ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, భక్తులు సహాయం కోసం సంబంధిత పోలీసు కమిషనర్, డిఐజి లేదా పోలీసు సూపరింటెండెంట్‌ను సంప్రదించవచ్చు.
  • ఒకవేళ ఏవేని ఇబ్బందులు ఎదురైతే.. సంప్రదించాల్సిన పోలీసు అధికారుల నంబర్లు –
  • రవిశంకర్‌ అయ్యన్నార్‌ ఫోన్‌ నంబర్: 99080 17338.
  • డీఐజీ రాజశేఖర్‌బాబు ఫోన్‌ నంబర్: 80081 11070.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 10 =