పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు అస్వస్థతకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి మూలాలపై నిర్ధారణకు ఏపీ ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. 21 మంది సభ్యులతో కూడిన ఈ హైపవర్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని చైర్మన్ గా వ్యవహరించనున్నారు. కన్వీనర్‌గా ఆరోగ్య శాఖ ప్రినిపల్ సెక్రెటరీ ఉండనున్నారు. ఏలూరులో ఈ వింత వ్యాధి తలెత్తడానికి గల కారణాలు, నివారణ చర్యలపై అధ్యయనం చేసి తీసుకోవాల్సిన జాగ్రతలపై ఈ కమిటీ సిఫార్సు చేయనుంది.
మరోవైపు ఇప్పటివరకు వ్యాధి లక్షణాలతో మొత్తం 604 మంది బాధితులు ఏలూరు ఆస్పత్రిలో చేరగా చికిత్స అనంతరం 536 మంది డిశ్చార్జి అయ్యారు. అలాగే కొంతమందిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి, గుంటూరు జీజీహెచ్ కు తరలించి వైద్యం అందిస్తున్నారు. గురువారం కొత్తగా ఆస్పత్రిలో చేరిన 14 మందితో కలిపి ప్రస్తుతం 33 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ