టికెట్ నిరాకరించిన జగన్.. వైసీపీని వీడనున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు?

Jagan Who Refused The Ticket Those Four Mlas Who Will Leave Ycp,Jagan Who Refused The Ticket Those Four Mlas,Mlas Who Will Leave Ycp,Ycp, Cm Jaganmohan Reddy, AP, AP Assembly Elections,Mango News,Mango News Telugu,Andhra Cm Jagan Mohan Reddy, AP Politics, AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News And Live Updates
YCP, CM Jaganmohan reddy, AP, AP Assembly elections

వైసీపీలో అసంతృప్తి సెగలు ఎగిసిపడుతున్నాయి. అధినేత జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నకొద్దీ.. అసంతృప్తుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఒక్కొక్కరుగా అసంతృప్తులు బయటికొస్తున్నారు. ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కండువా మార్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తెలుగు దేశం పార్టీలో చేరిపోయారు. మరికొంత మంది కూడా తెలుగు దేశం, జనసేన పార్టీలో చేరేందుకు గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారు. మూడో జాబితాలో తమకు కాకుండా వేరే వారికి టికెట్ ఇవ్వడంతో.. నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారట.

గురువారం రాత్రి వైసీపీ మూడో జాబితా వెలువడింది. ఈసారి 15 అసెంబ్లీ స్థానాలకు.. 6 లోక్‌సభ స్థానాలకు ఇంఛార్జ్‌లను జగన్ మార్చేశారు. తిరువూరు, పత్తిపాడు, పిఠాపురం, పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను జగన్మోహన్ రెడ్డి పక్కకు పెట్టేశారు. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చారు. దీంతో ఆ నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారట. త్వరలోనే పార్టీ కండువా మార్చేయనున్నారట. కొందరు జనసేన వైపు.. మరికొందరు తెలుగు దేశం వైపు చూస్తున్నారట.

ఎన్టీఆర్ జిల్లాకు చెందిన తిరువూరు నియోజకవర్గానికి ప్రస్తుతం రక్షణనిధి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయన్ను జగన్మోహన్ రెడ్డి ఈసారి పక్కకు పెట్టేశారు. దీంతో రక్షణనిధి తెలుగు దేశంవైపు చూస్తున్నారట. ఇప్పటికే టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లారట. త్వరలోనే ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే తెలుగు దేశం పార్టీ తరుపున పామర్రు నుంచి రక్షణనిధి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థసారధిని కూడా జనగ్ సైడ్ చేసేశారు. దీంతో ఆయన కూడా టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారట. పార్థసారథికి నూజివీడు టికెట్ కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఇకపోతే పిఠాపురం ఎమ్మెల్యే పెండె దొరబాబు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ నిరాకరించడంతో పార్టీ మారేందుకు గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే దొరబాబు జనసే నేతలతో చర్చలు జరిపారట. త్వరలోనే ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. అటు అసంతృప్తితోవున్న పత్తిపాడు ఎమ్మెల్యే పర్వతపూర్ణ చంద్రప్రసాద్ కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఆయన జనసేన, తెలుగు దేశం పార్టీలతో చర్చలు జరిపారు. త్వరలోనే నిర్ణయం తీసుకొని జనసేన లేదా టీడీపీలో చంద్రప్రసాద్ చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ముందు ముందు ఇంకెంత మంది వైసీపీకి షాక్ ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − one =