ఈఎస్‌ఐ కేసులో అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్ కొట్టివేత

AP News, AP Political Updates, Atchannaidu, Atchannaidu Bail, Atchannaidu Bail Petition, Atchannaidu ESI Scam, High Court Dismisses Atchannaidu Bail Petition, TDP MLA Atchannaidu, TDP MLA Atchannaidu Bail Petition

ఈఎస్‌ఐ కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు మరోసారి చుక్కెదురైంది. అచ్చెన్నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఈ రోజు హైకోర్టు కొట్టివేసింది. అలాగే ఈఎస్‌ఐ కుంభకోణంలో నిందితులుగా ఉన్న రమేశ్‌ కుమార్‌ సహా ఇతరులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ లను సైతం హైకోర్టు కొట్టివేసింది. ‌ఇటీవలే ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించే విధంగా ఆంధప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని అచ్చెన్నాయుడు హైకోర్టులో పిటిషన్‌ వేయగా, అనుమతి ఇస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ప్రస్తుతం గుంటూరు లోని రమేశ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu