భారత్ లో 15 లక్షలు దాటిన కరోనా కేసులు, 34 వేలకు పైగా మరణాలు

Corona Positive Cases Cross 15 Lakh Mark in India and Death Toll Reaches to 34193

దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండడంతో గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ 45 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. అలాగే కరోనా మరణాల సంఖ్య కూడా 34,193 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 48,513 కరోనా పాజిటివ్ కేసులు, 768 కరోనా మరణాలు నమోదయ్యాయి. జూలై 29, బుధవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,31,669 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాలలో కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. మరోవైపు కరోనా బాధితుల రికవరీ రేటు 64.51 శాతానికి పెరిగింది. అలాగే కరోనా మరణాల రేటు 2.23 శాతంగా ఉంది.

దేశంలో కరోనా కేసులు వివరాలు (జూలై 29, ఉదయం 9 గంటల వరకు):

  • దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 15,31,669
  • కొత్తగా నమోదైన కేసులు (జూలై 28 – జూలై 29 (8AM-8AM) : 48,513
  • నమోదైన మరణాలు : 768
  • డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 9,88,029
  • యాక్టీవ్ కేసులు : 5,09,447
  • మొత్తం మరణాల సంఖ్య : 34,193

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 5 =