ఏపీలో ఆ రెండు రోజులు సెలవులు ప్రకటన

Holiday Announced on April 7, 8 in AP in the View of ZPTC, MPTC Elections

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 8వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 7, 8 తేదీల్లో ఏపీ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 7న ఎన్నికల ఏర్పాట్లకు, 8న పోలింగ్ నిర్వహణ ఉండడంతో సెలవులు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు సోమవారం నాడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆయా తేదీల్లో స్థానికంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, దుకాణాలకు, వాణిజ్య సంస్థలకు సెలవు ప్రకటించాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే పోలింగ్ జరిగే రోజుకు 48 గంటలకు ముందు ఆయా ప్రాంతాల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఏప్రిల్ 8న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా, ఏప్రిల్ 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ