ఓట్ల కోసం కోట్లు కుమ్మరిస్తున్న వైసీపీ

AP votes,Pawan Kalyan, NDA, Chandrababu, TDP, Janasena, BJP, Modi, YCP, CM Jagan, Congress,AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
AP votes,Pawan Kalyan, NDA, Chandrababu, TDP, Janasena, BJP, Modi, YCP, CM Jagan, Congress

ఎన్నికల సంగంతేంటో కానీ.. ఈ మధ్య ఏపీలో ఎవరిని కలిసినా మా అకౌంట్లో డబ్బులు పడ్డాయి..నీకు పడ్డాయా అనే మాటలు తెగ వినిపిస్తున్నాయి. కుల వృత్తులు చేసుకునే వారి నుంచి చిన్న వ్యాపారులు చేసుకునే వారి వరకూ మాకు ఇంత పడ్డాయి..మాకు అంత పడ్డాయన్న కూడికలు, తీసివేత లెక్కల గురించే టాక్స్ నడుస్తున్నాయి. దీంతో ఏపీ ప్రజల మీద సీఎం జగన్ తెగ దయ చూపిస్తున్నారంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

తాజాగా వైఎస్సార్ చేయూత పథకం పేరే చాలా మంది దగ్గర వినిపిస్తోంది. చేతి వృత్తులు, చిన్నచిన్న వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని..తమ కాళ్ల మీద బతికేలా మహిళలకు చేయూతను అందిస్తోన్న పథకమే ఈ వైఎస్సార్ చేయూత పథకం. ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీ మహిళల జీవనోపాది కోసం అంటూ 26,98, 931 మంది మహిళల ఖాతాల్లో ఒక్కొక్కరికీ రూ.18,750 చొప్పున తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు.

2020 ఆగస్టు 12 ఈ పథకాన్ని..ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కుటుంబాల స్త్రీలు శాశ్వత జీవనోపాధి పొందేలా చేయడానికి సీఎం జగన్ ప్రారంభించారు. ఇప్పటి వరకు 4 విడతలుగా ఒక్కో విడతలో రూ.18,750 చొప్పున ప్రతి అర్హురాలైన మహిళకు రూ.75 వేలను వారి ఖాతాల్లో జమ చేస్తూ వచ్చారు.

సుమారు 27 లక్షల మంది మహిళలకు ..ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వం డబ్బులు అందించడం మామూలు విషయం కాదని కొంతమంది అంటున్నారు.. ఈ ఒక్క పథకానికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.17,189 కోట్ల వరకు ఖర్చు చేసింది. దీంతో ఎన్నికల ముందు తాయిలాలు వేయడంలో జగన్ సిద్ధహస్తుడు అంటూ మరికొంతమంది సెటైర్లు వేసుకుంటున్నారు.

అయితే ఇలా డబ్బులు వేయడాన్ని ఏపీ ప్రజలు కోరుకోవడం లేదని.. వాళ్లు తమకు ఉపాధి ఇవ్వాలని కోరుకుంటున్నారని ప్రశాంత్ కిశోర్ లాంటి రాజకీయ వ్యూహకర్తల నుంచి జయప్రకాశ్ నారాయణ వంటి మేధావుల వరకూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ జగన్ మాత్రం తన ఉచిత పథకాలు ఎక్కువ ఫలితాలు ఇస్తాయన్న లెక్కలతో.. ఇచ్చిన మాట ప్రకారం అందరి ఖాతాల్లో వివిధ పథకాల కింద నిధులు జమ చేస్తూనే ఉన్నారు.

ఎన్నికల కోడ్ అమలు రాకముందే తాము పంచే డబ్బులు..వైసీపీ ఖాతాలోకే వస్తాయని..అవి కచ్చితంగా ఓటు బ్యాంకును ఇస్తుందన్న నమ్మకంతో జగన్ ఉన్నారు. దీనికి తోడు చిన్న పేద వారిని, బిలో మిడిల్ క్లాస్ వాళ్లను తమ వైపు తిప్పుకోవాలంటే అవి ఉచితంగా డబ్బులు పంచడమే అన్న ధీమాతో జగన్ ఉన్నారు. అందుకే అప్పులు తెచ్చి అయినా సరే అభివృద్ధిని సైతం పక్కన పెట్టి..ఉచిత పథకాలకు మాత్రం నిధులు సమకూరుస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 4 =