తెరపైకి మరో రెండు కొత్త నియోజకవర్గాలు

Pawan Kalyan,constituency, Pawan Kalyan contesting,Bhimavaram,Kakinada, Pithapuram, Jana Sena, Jana Sena cadre, TDP, BJP, YCP,AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
Pawan Kalyan,constituency, Pawan Kalyan contesting,Bhimavaram or Kakinada, Pithapuram, Jana Sena, Jana Sena cadre, TDP, BJP, YCP

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై  ఉత్కంఠ కొనసాగుతుంది. పొత్తులో భాగంగా  టీడీపీ, జనసేన కలిసి రిలీజ్ చేసిన తొలి జాబితాలో..  జనసేనకు కేటాయించిన 24 సీట్లలో పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేస్తున్న స్థానాన్ని  పవన్ ప్రకటించకపోవడం తాజాగా హాట్‌టాఫిక్‌ అయింది.ఇటీవల  భీమవరంలో పర్యటించిన పవన్‌ కల్యాణ్ అక్కడి టీడీపీ, బీజేపీ నేతలతో భేటీ అయ్యారు. తాను భీమవరం నుంచి పోటీ చేస్తున్నాననే సంకేతాలను ఇచ్చారు.

పవన్‌ కళ్యాణ్ భీమవరం నుంచి బరిలోకి దిగితే తామంతా సహకరిస్తామని  టీడీపీ నేతలు కూడా  చెప్పుకొచ్చారు. మరోవైపు జనసేన నేతలు కూడా తమ పార్టీ అధినేత  భీమవరం నుంచి పోటీ చేస్తున్నారంటూ ప్రచారం చేశారు. దీంతో పవన్ కళ్యాణ్  అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని అంతా అనుకున్నారు. కానీ తాజాగా జనసేన సీట్లను ప్రకటించిన  పవన్‌.. తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తాడనే విషయాన్ని  చెప్పకపోవడంతో  మళ్లీ  ఊహాగానాలు తెరమీదకు వచ్చాయి.

అసలు పవన్‌ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో అన్న విషయం తెలియక ఇటు కేడర్ అయోమయంలో పడింది. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి బరిలో దిగడానికి,  మంగళగిరి నుంచి నారా లోకేష్‌ పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు.  కానీ పవన్‌ పోటీ చేస్తున్న స్థానాన్ని ఇప్పటికీ ప్రకటించకపోవడంతో అంతా అయోమయానికి లోనవుతున్నారు. భీమవరం ప్రకటన విషయంలో  పవన్‌ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ  దానిపై ఏపీ వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతుంది.

గత ఎన్నికలలో పవన్‌ కళ్యాణ్‌ భీమవరం, గాజువాక రెండు  స్తానాలలో పోటీ చేశారు. కానీ రెండు చోట్ల పవన్ ఓటమి పాలయ్యారు. పవన్  భీమవరం నుంచి పోటీ చేస్తారని మొదట నుంచి వార్తలు వినిపిస్తున్నా కూడా  పవన్ కళ్యాణ్ మరో స్థానం నుంచి బరిలో దిగడానికి  ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే పిఠాపురం, కాకినాడ పేర్లను పవన్ పరిశీలిస్తున్నారనే టాక్ నడుస్తుంది.

ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా బలమైన కాపు సామాజిక వర్గంతో పాటు జనసేన పార్టీకి క్షేత్రస్థాయిలో కేడర్ ఉందనే రాజకీయ సమీకరణాలతో  అటువైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తుంది.మొత్తంగా  భీమవరం లేదా, కాకినాడ, పిఠాపురంలో ఏదొక స్థానం నుంచి పవన్  కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ  విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాలపైన కూడా పవన్ కళ్యాణ్ ప్రధానంగా స్పెషల్ ఫోకస్ చేశారు.ముఖ్యంగా రాయలసీమలో అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలపైన జనసేన అధినేత గురిపెట్టారు. బలిజ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే కడప, అనంతపురం జిల్లాల పరిధిలో రాజంపేటతో పాటు మిగిలిన నియోజకవర్గాల్లో తమపార్టీ అభ్యర్థులను బరిలో దింపడానికి పవన్ భావిస్తున్నారు.

అందుకే టీడీపీ,జనసేన కూటమి తొలిజాబితాలో.. జనసేనకు కేటాయించిన 24 సీట్లలో ఐదు స్థానాలను ప్రకటించిన పవన్.. మిగిలిన టికెట్ల కోసం అభ్యర్థుల ఎంపికలో  జాగ్రత్తలు  తీసుకోవడనికి రెడీ అవుతున్నారు.మొత్తంగా మరో  రెండు మూడురోజుల్లో ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అప్పుడు తాను నిలబడే నియోజకవర్గం నుంచి గురించి ప్రకటించే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − ten =