తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు: ఓటు వేసిన రజనీకాంత్, విజయ్, అజిత్, సూర్య

2021 Assembly Elections, 2021 Tamil Nadu Assembly Elections, Ajith, Assam, Assembly Elections 2021, Assembly Elections Polling in 5 States, Mango News, Rajinikanth, Surya and other Celebrities Cast their Vote, Tamil Nadu, Tamil Nadu Assembly elections, Tamil Nadu Assembly Elections 2021, Tamil Nadu Assembly Elections Polling, Tamil Nadu Celebrities Cast their Vote, Vijay

తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో 3998 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా 88,937 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 6.2 కోట్లు మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా, సాయంత్రం 7 గంటల వరకు కొనసాగనుంది. కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన వ్యక్తులకు సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ప్రత్యేకంగా ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. ఉదయం 11:30 గంటల వరకు తమిళనాడులో 21 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

మరోవైపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా డీఎంకే అధినేత స్టాలిన్, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తమిళనాడులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, విజయ్, అజిత్, సూర్య, విక్రమ్, కార్తీ, శరత్ కుమార్, రాధిక, ఉదయనిధి స్టాలిన్, ఖుష్బూ, ప్రభు, విష్ణువిశాల్, శృతి హాసన్, అక్షర హాసన్, సత్యరాజ్, శశికుమార్, ప్రసన్న, నమిత, దర్శకుడు మురుగదాస్ సహా పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా వీరిలో నటుడు విజయ్‌ సైకిల్‌ పై వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =