కూటమి అధికారంలోకి వస్తే.. మంత్రివర్గంలో బాలకృష్ణకు చోటు?

Alliance, Balakrishna, Cabinet, MLA Balakrishna, TDP, Hindupuram, Telugu desam party, Vijayawada News, AP Cabinet, 2024 elections, Andhra Pradesh News Updates, AP Politics, AP Elections, Mango News Telugu, Mango News
MLA Balakrishna, TDP, Hindupuram, Telugu desam party

ఐదేళ్లుగా అధికారానికి దూరంగావున్న తెలుగు దేశం పార్టీ.. ఈసారి ఎలాగైనా గద్దెనెక్కాలని పావులు కదుపుతోంది. జనసేనతో పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తోంది. అటు సానుకూల పవనాలు కూడా జనసేన-టీడీపీ కూటమి వైపే వీస్తున్నాయి. ఏపీలో అధికారంలోకి వచ్చేది టీడీపీ-జనసేన కూటమేనని సర్వేలు చెబుతున్నాయి. ఈక్రమంలో మరింత జోష్‌తో ముందుకెళ్తున్నాయి జనసేన-తెలుగు దేశం పార్టీలు. ప్రస్తుతం కూటమి అధికారంలోకి వస్తే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు కొత్త ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

అయిదు దశాబ్దాలుగా సినిమాలతో జనాలను అలరిస్తున్న బాలకృష్ణ 2014లో రాజకీయాల్లో అరంగేట్రం చేశారు సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. తన తండ్రి పోటీ చేసి గెలిచిన హిందూపురం నియోజకవర్గం నుంచే బాలకృష్ణ పోటీ చేశారు. వరుసగా రెండుసార్లు గెలుపొంది అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014లో టీడీపీ తరుపున హిందూపురం నుంచి మొదటిసారి బాలకృష్ణ బరిలోకి దిగారు. భారీ మెజార్టీతో గెలుపొంది మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే అప్పుడు ఏపీలో టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది. కానీ బాలకృష్ణకు మంత్రి పదవి దక్కలేదు. తన అల్లుడు నారా లోకేష్‌కు  కీలక శాఖలకు మంత్రిగా పనిచేసినప్పటికీ.. బాలకృష్ణ మాత్రం మంత్రి  కాలేకపోయారు.

ఆ తర్వాత 2019లో మరోసారి హిందూపురం నుంచి బాలకృష్ణ పోటీ చేసి గెలుపొందారు. కానీ ఈసారి ఏపీలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బాలకృష్ణ సాధారణ ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు. ఐదేళ్లుగా వరుస సినిమాలు చేస్తూ.. ఇటు నియోజకవర్గ ప్రజలకు బాలకృష్ణ దగ్గరగా ఉంటున్నారు. అయితే త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూటమి గెలుపు ఖాయమని.. వచ్చే టీడీపీ-జనసేన ప్రభుత్వమేనని సర్వేలు చెబుతున్నాయి. దీంతో కూటమి అధికారంలోకి వస్తే మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలని బాలకృష్ణ భావిస్తున్నారట.

అధికారంలోకి వచ్చాక.. మంత్రి పదవి దక్కించుకొని పూర్తిగా రాజకీయాల్లోనే ఉండాలని బాలకృష్ణ అనుకుంటున్నారట. సినిమాలకు దూరంగా ఉండి ప్రజాక్షేత్రంలో ఉండాలని ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం బాలకృష్ణ బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ మూవీ పూర్తయిన తర్వాత కంప్లీట్‌గా రాజకీయాలపై ఫోకస్ చేయాలని బాలకృష్ణ అనుకుంటున్నారట. మరి చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో…

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY