సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేత, కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ

TDP Senior Leader Kaikaluru Ex MLA Jayamangala Venkata Ramana Joins YSRCP in Presence of CM Jagan,TDP Senior Leader, Kaikaluru Ex MLA Jayamangala Venkata Ramana.Joins YSRCP in Presence of CM Jagan,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

సీనియర్ నేత, కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ వైఎస్సార్‌సీపీలో చేరారు. గురువారం ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు సీఎం జగన్ జయమంగళ వెంకట రమణకు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. కాగా 2009లో వెంకట రమణ కైకలూరు నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి బయటకు రాకముందు నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. అయితే గత కొద్దిరోజులుగా ఆయన పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. అలాగే పార్టీ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలకు కూడా దూరంగానే ఉంటూ వస్తున్నారు. కైకలూరు టీడీ ఇన్‌చార్జి వెంకట రమణను ఆ పదవి నుంచి తప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై తెలుగుదేశం హైకమాండ్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

ఈ విషయం తెలుసుకున్న మంత్రి నాగేశ్వరరావు, వెంకటరమణను వైఎస్సార్‌సీపీలోకి వెళ్లమని ప్రోత్సహించారు. ఈ నేపథ్యంలో వెంకట రమణ వైఎస్సార్‌సీపీలో చేరనున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తన అనుయాయులు మరియు సన్నిహితులతో చర్చలు జరిపిన అనంతరం ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో వెంకట రమణ నిన్న తన సహచరుడు, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర నాయకుడు ఎస్‌ గుర్రాజు సహా వైఎస్సార్‌సీపీలో చేరారు. ఇక ఈ కార్యక్రమంలో ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మరియు కైకలూరు వైసీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కాగా త్వరలో ఏపీలో 14 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో వెంకట రమణకు సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇక 1999లో రాజకీయాల్లోకి వచ్చిన వెంకట రమణ తెలుగుదేశం పార్టీ నుంచి 2005లో కైకలూరు జెడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికయ్యారు. అనంతరం 2009లో టీడీపీ టికెట్‌పై కైకలూరు నియోజకవర్గం నుంచి గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. కాగా కాపు సామాజికవర్గానికి చెందిన వెంకట రమణకు కైకలూరు ప్రాంతంలో మంచి పట్టు ఉంది. ఆయన అధికార వైఎస్సార్‌సీపీలోకి వెళ్లడం ఆ ప్రాంతంలో ప్రతిపక్ష టీడీపీపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − six =