ఆ స్థానాల్లో ఆశావాహులకు టీడీపీ బిగ్ షాక్

TDP, Big Shock for the Aspirants, Chandrababu Naidu, Janasena, AP Elections, Nara Lokesh, YSRC, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP , Pawan Kalyan, Mango News Telugu, Mango News
TDP, Chandrababu Naidu, Janasena, AP Elections

ఏపీలో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ఇప్పటికే వైసీపీ విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తోంది. అటు జనసేన-టీడీపీ పార్టీలు కూడా అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ మూడు స్థానాలు, జనసేన రెండు స్థానాలు ప్రకటించగా.. మరికొద్దిరోజుల్లో పూర్తిస్థాయి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. అయితే జనసేనతో పొత్తుపెట్టుకొని కొందరు మాజీ నేతలకు షాక్ ఇస్తోందట  తెలుగు దేశం పార్టీ. మాజీ నేతలకు టికెట్ ఇవ్వకుండా ఆయా స్థానాలను జనసేనకు కేటాయిస్తోందట.

పలాస అసెంబ్లీ టికెట్ కోసం మాజీ మంత్రి గౌతు శ్యామ సుందర శివాజీ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తన కూతురు గౌతు శిరీషకు ఆ టికెట్ ఇప్పించుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే శిరీషకు టీడీపీ ఓసారి టికెట్ ఇచ్చింది. 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున పలాస నుంచి బరిలోకి దిగిన శిరీష.. వైసీపీ అభ్యర్థి మంత్రి సీదరి అప్పలరాజు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆమెకు ప్రజాదరణ కూడా తగ్గిపోయింది. ఈక్రమంలో ఆమెకు టికెట్ ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా లేదట. అందుకే ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించినట్లు తెలుస్తోంది.

అటు మాజీ మంత్రి కమిడి కళా వెంకటరావుకు కూడా టీడీపీ అధిష్టానం ఈసారి షాక్ ఇవ్వనుందట. ఎచ్చెర్ల టికెట్‌ను వెంకటరావు ఆశిస్తున్నారు. అయితే అదే సీటును కళిశెట్టి అప్పలనాయుడు కూడా కోరుతున్నారు. ఎట్టిపరిస్థితిలో వెంకటరావుకు టికెట్ ఇవ్వొద్దని.. తనకే టికెట్ ఇవ్వాలని హైకమాండ్ వద్ద పట్టుపట్టుకొని కూర్చున్నారట అప్పలనాయుడు. మరోవైపు అదే స్థానం నుంచి పోటీ చేసేందుకు జనసేన సిద్ధంగా ఉందట. గతంలో ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభను కూడా నిర్వహించారు. ఈక్రమంలో జనసేనకు ఎచ్చెర్ల టికెట్ ఇచ్చేందుకు మెగ్గుచూపారట చంద్రబాబు నాయుడు.

రాజం, గజపతినగరం, పెందుర్తి కూడా ఇదే సీన్ రిపీట్ అవుతోందట. గజపతినగరం టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు ఆశిస్తున్నారు. అయితే ఈ సీటు ఆశిస్తున్న ఆశావాహుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. పెద్ద ఎత్తున నేతలు ఆ సీటు కోసం పోటీపడుతున్నారట. వారిలో ఎవరికి ఇచ్చినా.. మిగతా వారివల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుందని భావించిన చంద్రబాబు.. గజపతినగరం కూడా జనసేనకు కేటాయించారట. ఇలా కొందరికి టికెట్ ఇవ్వలేక ఆయా స్థానాలను టీడీపీ.. జనసేనకు కేటాయిస్తోందట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − ten =