జ‌గ‌న్‌పై దాడి కేసు : టీడీపీ సెల్ఫ్ గోల్?

Jagan Attack Case: TDP's Own Goal?, Jagan Attack Case, TDP Own Goal, CM Jagna, AP State Elections, Chandrababu Naidu, Nara Lokesh, Pawan kalayan, TDP, YSRCP, Jenasena, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
CM Jagna , AP State elections , Chandrababu Naidu , Nara Lokesh , Pawan kalayan , TDP , YSRCP , Jenasena

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి దాడి కేసులో ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈకేసులో  పురోగ‌తి సాధించిన పోలీసులు ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. కోర్టులో హాజ‌రుప‌రిచారు. సీఎంను చంప‌డానికే ఈకుట్ర‌కు పాల్ప‌డిన‌ట్లుగా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. ముఖ్య‌మంత్రిపై దాడి  చేయాల‌ని ముంద‌స్తు ప‌థ‌కం వేసుకున్న నిందితుల్లో ఏ1ను ఏ2గా ఉన్న నిందితుడు ప్రేరేపించాడు. దాడి చేసేందుకు ఏ1 కొన్ని రాళ్ల‌ను త‌న జేబులో ఉంచుకున్నాడు. సింగ్ న‌గ‌ర్ ప్రాంతంలోని వివేకానంద స్కూల్ వ‌ద్ద జ‌గ‌న్ రాక కోసం వేచి చూశాడు. ఏ2 ప్రోద్బ‌లంతో జ‌గ‌న్ రాగానే ఏ1 నిందితుడు ఆయ‌న‌పైకి రాయి విసిరారు. ఈ దాడి వెనుక సీఎంను చంపాల‌నే దురుద్దేశం ఉంద‌ని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న‌ట్లు తెలిసింది.

పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయ‌డం, రిమాండ్  రిపోర్ట్ లోని అంశాలు బ‌య‌ట‌కు రావ‌డంతో ఈకేసు రాజ‌కీయంగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ఇందులో పొలిటిక‌ల్ కాన్పిర‌సీ (రాజ‌కీయ కుట్ర‌) ఉంద‌ని తేల‌డంతో ప్ర‌తిప‌క్ష పార్టీలో క‌ల‌వ‌రం మొద‌లైంది. వాస్త‌వానికి ఈకేసులో టీడీపీ నేత బోండా ఉమ‌ను ఇరికించే కుట్ర జ‌రుగుతోంద‌ని తొలుత‌.. టీడీపీ నేత‌లే ప్ర‌చారం మొద‌లుపెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. విచార‌ణ అధికారులు కానీ, అధికార పార్టీ వైసీపీ కానీ బొండ ఉమ‌ను పేరు వాడిన‌ట్లు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. మొట్ట‌మొద‌టి సారిగా ఉమ పేరు టీడీపీ నేత‌ల నుంచే ప్రాచుర్యంలో వ‌చ్చింద‌ని వైసీపీ చెబుతోంది. టీడీపీకి చెందిన ఎవ‌రి పేర్ల‌నూ ఈ కేసులో పోలీసులు ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌స్తావించ‌క‌పోయిన‌ప్ప‌టికీ, గుమ్మ‌డికాయ‌ల దొంగ అన‌గానే.. భుజాలు త‌డుముకునే రీతిలో తెలుగుదేశం పార్టీ నేత‌లు వ్య‌వ‌హ‌రించార‌ని అధికార పార్టీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు.

నేరం తీవ్ర‌త‌ను బ‌ట్టి హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు చేసిన పోలీసులు  ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించి,  మొత్తం 12 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే వారు ఎవ‌రెవ‌రు అనేది ఇప్ప‌టికీ బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌లేదు. అయితే అందులో ఒక‌రు టీడీపీకి చెందిన వారు ఉండ‌డం, అత‌డు బోండా ఉమ కార్యాల‌య ప‌నులు కూడా చూస్తాడ‌ని తెలిసిన‌ప్ప‌టి నుంచీ.., ఉమ‌ను ఇరికంచే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌న్న ప్ర‌చారం మొద‌లైంది. అయితే ఉమ పేరును టీడీపీయే తెర‌పైకి తెచ్చింద‌న్న వాద‌న‌లు ఆస‌క్తిరి రేపుతున్నాయి. ఓ ప్రెస్ రిలీజ్ లో చంద్ర‌బాబునాయుడే ఉమ పేరును పేర్కొన్న‌ట్లు వైసీపీ చెబుతోంది. అలాగే, దీనిపై బోండా ఉమ కూడా తీవ్ర‌స్థాయిలో స్పందించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈకేసులో నా పేరు పెడితే జూన్ 4 త‌ర్వాత అంతు చూస్తా.. అంటూ పోలీసుల‌ను బెదిరించ‌డం వివాదాస్ప‌దంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY