దెందలూరుపై కన్నేసిన కమలం పార్టీ

Chintamaneni Prabhakar Will Have A Ticket?, Prabhakar Will Have A Ticket, YCP, TDP, Janasena, Chandrababu, Jagan, Chintamaneni Prabhakar,BJP, Dendalur,Garapati Seetharamanjaneya Chaudhary,Tapana Chaudhary, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
YCP, TDP, Janasena, Chandrababu, Jagan, Chintamaneni Prabhakar,BJP, Dendalur,Garapati Seetharamanjaneya Chaudhary,Tapana Chaudhary

ఏపీలో ఓ వైపు నామినేషన్ల పర్వం, ప్రచారాల  జోరు కొనసాగుతుండగా..  మరోవైపు పొత్తుల పంపకాలు తేలి అభ్యర్థుల ప్రకటన జరిగినా కూడా కూటమిలో ఇంకా దోబుచూలాట కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఒకటి, రెండు నియోజకవర్గాలలో అభ్యర్థుల మార్పు, సీట్లలో మార్పు జరుగగా.. తాజాగా  దెందలూరు నియోజకవర్గంలోనూ  ఇలాంటి పరిస్థితే కనిపించేలా ఉంది.

ఏలూరు జిల్లాలో ఓ సీటు కావాలని చంద్రబాబుపై  బీజేపీ పెద్దలు కొద్ది రోజులుగా ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఇది ఏకంగా దెందలూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చింతమనేనికి ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. నిజానికి ఫస్ట్ లిస్ట్‌లోనే చింతమనేని ప్రభాకర్ పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అప్పటి నుంచి చింతమనేని ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ప్రజలలోకి వెళ్లిపోయారు.

రెండుసార్లు దెందలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చింతమనేని  ప్రభాకర్..ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతున్నారు. కానీ ఇప్పుడు కూటమి పొత్తులో భాగంగా చింతమనేని ప్రభాకర్ సీటుకు ఎసరొచ్చేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

దెందలూరు నుంచి బీజేపీ  సీనియర్ నేత గారపాటి సీతారామాంజనేయ చౌదరి అలియాస్ తపనా చౌదరిని  పోటీలోకి  దింపడానికి  బీజేపీ పెద్దలు రెడీ అవుతున్నారు. సంఘ్ పరివార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న తపనా చౌదరికి సీటు ఇమ్మంటూ చంద్ర బాబుపై కమలం పెద్దలు ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రతిపాదన చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారట. దెందలూరును భారతీయ జనతా పార్టీకి ఇస్తే తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తిని తెలుగుదేశం పార్టీకి ఇచ్చేలా కాషాయ పార్టీ సిద్దమైనట్లు తెలుస్తోంది.

దీనికి చంద్రబాబు ఒప్పుకున్నా.. చింతమనేని సైలెంట్ అవుతారా అన్నదే  ఇప్పుడు అనుమానం. ఎందుకంటే టీడీపీలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న నేత.. చింతమనేని ప్రభాకర్ అన్న విషయం అందరికీ తెలుసు. ఆయన ఎన్నో వివాదాలకు కేరాఫ్. అంతేగాదు చింతమనేనిపై రౌడీ షీట్ కూడా తెరిచి ఉంది. దీంతోనే చంద్రబాబు కూడా ఆలోచిస్తున్నారని.. ప్రభాకర్‌ని పోటీ నుంచి తప్పించడం టీడీపీకి అంత ఈజీ కాదనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలకు ఫుల్ స్టాప్ ఎప్పుడో చూడాలంటే ఒకటి, రెండు రోజులు ఆగాల్సిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 8 =