ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు కోసం “జగనన్న విద్యా కానుక” పేరుతో కొత్త పథకానికి ఏపీ ప్రభుత్వం రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. 2020–21 విద్యా సంవత్సరం నుంచే 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు 7 రకాల వస్తువులతో కూడిన కిట్ ను విద్యాకానుక కింద అందించాలని నిర్ణయించారు. ముందుగా సెప్టెంబర్ 5 న పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో అదేరోజున విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్ అందించేలా ఏర్పాట్లు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన అన్ లాక్-4 మార్గదర్శకాలలో ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా సెప్టెంబరు 30 వరకు పాఠశాలలు తెరవకూడదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఏపీ పాఠశాల విద్య సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని అక్టోబరు 5 వ తేదికి వాయిదా వేసినట్టుగా ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu