సెప్టెంబ‌ర్ 16 నుంచి అక్టోబ‌ర్ 19 వరకు కేయూ డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు

Kakatiya University, Kakatiya University Degree, Kakatiya University Degree Final Year Exams, Kakatiya University Degree Final Year Exams Schedule, Kakatiya University Degree Final Year Exams Schedule Released, Kakatiya University Time Table, Kakatiya University Time Table 2020

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు కాకతీయ యూనివర్సిటీ సిద్ధమైంది. ఈ మేరకు బీ.కామ్‌, బీఏ(ఎల్), బీఎస్సీ, బీబీఏ, బీసీఏ ఆరో సెమిస్ట‌ర్‌ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను శుక్రవారం నాడు కాకతీయ యూనివర్సిటీ విడుద‌ల చేసింది. సెప్టెంబ‌ర్ 16వ తేదీ నుండి అక్టోబ‌ర్ 19వ తేదీ వరకు విద్యార్థులకు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. అలాగే ఈ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు జరగనున్నాయి. అధికారిక వెబ్ సైట్ https://www.kakatiya.ac.in/ లో ఎగ్జామినేషన్స్ విభాగంలో నోటిఫికెషన్స్/టైం టేబుల్స్ సెక్షన్ లో పరీక్షల పూర్తి షెడ్యూల్ వివరాలను అందుబాటులో ఉంచారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. విద్యార్థులు తప్పనిసరిగా ఫేస్ మాస్కులు ధ‌రించాలి. ప‌రీక్ష‌ కేంద్రాల వద్ద ధర్మల్ స్కానింగ్, శానిటైజేషన్ ఏర్పాట్లు చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here