2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సీన్స్ గుర్తున్నాయా? కాంగ్రెస్ పార్టీ సభల్లో టీడీపీ జెండాలు రెపరెపలాడాయి. చంద్రబాబు నేరుగా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వనే లేదు. అయినా టీడీపీ క్యాడర్ కాంగ్రెస్ కండువాలు కప్పుకోని మరీ హస్తం పార్టీ ప్రచారాల్లో పాల్గొంది. ఇదంతా రేవంత్-చంద్రబాబు మధ్య ఉన్న బలమైన బంధంలో భాగంగా జరిగిన తంతు అని నాడు మీడియా రాసుకొచ్చింది. ఇలా పొత్తులో లేకున్నా మద్దతు ఇవ్వకున్నా ఓ పార్టీ మరో పార్టీని సపోర్ట్ చేసింది. అయితే ఏపీలో మాత్రం సీన్ మారోలా కనిపిస్తోంది. పేరుకు టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో ఉన్నాయి కానీ ఎవరికి వారే సపరేటుగా ప్రచారాలు చేసుకుంటున్నారు. చిలకలూరిపేట ప్రజాగళం సభకు మోదీ-పవన్-చంద్రబాబు ఒకే వేదికపై కనిపించారు.. ఆ సభలో మాత్రమే ఈ మూడు పార్టీల నేతలు కలిసికట్టుగా పనిచేశారు. ఆ తర్వాత సభల్లో టీడీపీ సభలంటే కేవలం టీడీపీ జెండాలే..!
ఎవరికి వారే:
ఓవైపు చంద్రబాబు మొన్న 27నుంచి తన ప్రచార పర్వాన్ని షూరు చేయగా.. పవన్ కొన్ని గంటల్లో పిఠాపురం నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఇటు చంద్రబాబు సభల్లో ఎక్కడా కూడా జనసేన, బీజేపీ జెండాలు కనిపించడంలేదు. అంతా పసుపుమయంగానే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇటు జనసేన ప్రచారానికి సంబంధించిన కార్యకలాపాలకు కూడా టీడీపీ క్యాడర్ దూరంగా ఉంటోంది. అంతా జనసేన నేతలే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇక చాలా చోట్లా అసలు ఏపీ బీజేపీ అడ్రెస్ కూడా కనిపించని దుస్థితి నెలకొంది. ఇదంతా కూటమి ఫలితాలపై ప్రతీకూల ప్రభావాలు చూపే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు.
ఎందుకిలా?
నిజానికి 2014లోనూ ఈ మూడు పార్టీలు ఒకే తాటిపై పోటి చేశాయి. అప్పుడంతా కలిసికట్టుగా అడుగులో అడుగు వేసి ముందుకు వెళ్లారు. ఈసారి మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తుండడానికి పలు కారణాలు చెబుతున్నారు విశ్లేషకులు. పొత్తులో భాగంగా సీట్ల పంపకాల్లో కొంతమంది నేతలకు అన్యాయం జరగడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా జనసేనకు 21 సీట్లే కేటాయించడం ఆ పార్టీ క్యాడర్‌ను నిరుత్సాహ పరిచిందని చెబుతున్నారు. ముందుగా 24 సీట్లు కేటాయించగా.. తర్వాత వాటిని 21కు తగ్గించడం వారి అసంతృప్తికి ప్రధాన కారణం. గ్రౌండ్ లెవల్‌లో జనసేన హార్డ్‌వర్క్ చేసిందని.. ఏపీ బీజేపీ పెద్దగా ప్రభావం చూపకున్నా వారికి 10 ఎమ్మెల్యే సీట్లు, ఆరు ఎంపీ సీట్లు ఇవ్వడాన్ని జనసేన కార్యకర్తలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే తమ పార్టీని మాత్రమే సపోర్ట్ చేసుకుంటూ ముందుకుపోతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY