స్థానాలు మార్చాలని చంద్రబాబుపై ఒత్తిడి

BJP Is Unhappy With The Seats Allotted To TDP, BJP Is Unhappy With The Seats, Seats Allotted To TDP, BJP Allotted To TDP, BJP Is Unhappy With TDP, TDP, Janasena, BJP, Paderu, Anaparthi, Adoni, Somu Veerraju, GV L Narasimham, Vishnuvardhan Reddy,BJP Is Unhappy With The Seats, Janasena, YSRCP, Mango News, Mango News Telugu
TDP, Janasena, BJP ,Paderu, Anaparthi, Adoni, Somu Veerraju, GV L Narasimham, Vishnuvardhan Reddy ,BJP is unhappy with the seats,Janasena, Ysrcp

టీడీపీ ,జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా.. సీట్ల ప్రకటన అయితే వచ్చింది కానీ సీట్ల పంపకాలలో లొల్లి మాత్రం ఓ కొలిక్కి రావడం లేదు. పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి  10 అసెంబ్లీ , ఆరు లోక్ సభ స్థానాలు కేటాయించారు. అయితే బీజేపీ నుంచి పోటీ చేయడానికి చాలామంది కీలక నేతలు ఆశలు పెట్టుకోవడంతో , వీటితో పాటు  మరికొన్ని స్థానాలను తమ పార్టీకి  కేటాయించాల్సిందిగా టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ అధిష్టానం ఒత్తిడి తీసుకువస్తుంది.దీనికి తోడు ప్రకటించిన నియోజకవర్గాలను కూడా మార్చాలని తమ డిమాండ్‌ను చంద్రబాబు ముందు ఉంచుతోంది.

కానీ ఇప్పటికే తమ పార్టీ తగ్గించుకుని ఆ సీట్లను  త్యాగం చేయాల్సి వచ్చిందని.. అంతకు మించిన స్థానాలను  ఇక కేటాయించలేమంటూ టీడీపీ ఖరాఖండీగా చెప్పేస్తుంది.  అయితే ఇప్పుడు టీడీపీ తమకు కేటాయించిన సీట్ల విషయంలో బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఉద్దేశపూర్వకంగానే ఓడిపోయే స్థానాలను బీజేపీకి కేటాయించిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పటికే బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో  ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తాజాగా ఢిల్లీకి వెళ్లడం పార్టీ పెద్దలను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

పార్లమెంట్ స్థానాల విషయంలో బీజేపీ సంతృప్తికరంగానే ఉన్నా.. అసెంబ్లీ సీట్ల విషయంలోనే ఆ నేతల్లో ఎక్కువ అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. ముఖ్యంగా పాడేరు, అనపర్తి , ఆదోని వంటి నియోజకవర్గాలను భారతీయ జనతా పార్టీకి కేటాయించారు. అక్కడ బీజేపీకి కేడర్ లేకపోవడమే కాకుండా అక్కడ సరైన నాయకత్వం కూడా లేకపోవడంతో.. ఈ స్థానాల్లో పోటీ చేసినా కూడా ఓటమి తప్పదనే భయం బీజేపీ నాయకుల్లో వ్యక్తం అవుతుంది.

ఈ నియోజకవర్గాల్లో తెలుగు దేశం పార్టీ  పోటీ చేసినా గెలిచే అవకాశం లేకపోవడంతోనే..చంద్రబాబు కావాలలని తమకు కేటాయించారని కమలం నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై  కొంతమంది రాష్ట్ర నాయకులు ఢిల్లీలోని కేంద్ర పెద్దలకు  లేఖలు కూడా రాసినట్లు తెలుస్తోంది. దీంతో కొన్ని నియోజకవర్గాలలో  మార్పు చేర్పులు చేపట్టే విధంగా చంద్రబాబుపై  ఢిల్లీ పెద్దలతో  ఒత్తిడి చేయించాలని  ఏపీ కాషాయపార్టీ నేతలు .

మరోవైపు  తెలుగు దేశం పార్టీతో పాటు చంద్రబాబును వ్యతిరేకించే బీజేపీ నాయకులకు టికెట్ రాకుండా చూడాలనే ఆలోచనతో  టీడీపీ కేడర్ ఉన్నట్లు బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సోము వీర్రాజు , జీవీఎల్ నరసింహం, విష్ణువర్ధన్ రెడ్డి వంటి వారికి సీట్లు దక్కినా వారు గెలవడానికి టీడీపీ ఎంత వరకూ సహకారం అందిస్తుందో అన్నది అనుమానమే అంటున్నారు. అందుకే కొన్ని సీట్ల విషయంలో టీడీపీ అధిష్టానంపై బీజేపీ పెద్దలు ఒత్తిడి పెంచే అవకాశం కనిపిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 13 =