పట్టువదలని రఘురామ.. వెనక్కి తగ్గని కమలం!

Confusion Over Narasapuram MP Seat, Narasapuram MP Seat, Narasapuram MP, Confusion Over Narasapuram, Raghurama Krishna Raju, Krishna Raju Says Narasapuram MP Ticket Is With Me, BJP Fixed To Srinivasa Varma, Srinivasa Varma, BJP, TDP, AP, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
raghurama krishna raju says narasapuram mp ticket is still with me amid bjp fixed to srinivasa varma telugu news

2019లో వైసీపీ జెండాతో నరసాపురం నుంచి గెలిచిన రఘురామకృష్ణరాజు అప్పటి నుంచి ఇప్పటివరకు టీడీపీ వాయిస్‌తోనే మాట్లాడారు. గెలిచింది వైసీపీ నుంచే అయినా ఆయన ఏనాడు ఆ పార్టీ పనుల్లో పాలుపంచుకోలేదు. ఏం జరిగిందో ఏమో కానీ ప్రతీరోజూ ఓ వీడియో చేయడం.. అందులో వైసీపీని తిట్టడం.. మీడియాకు లైవ్‌ ఫుటేజ్‌ ఇవ్వడం.. దాదాపు ఐదేళ్లగా రఘురామ పని ఇది. అది కూడా అంతా ఢిల్లీ నుంచే. నరసాపురంలో తిరిగి కాళ్లు పెట్టడానికి ఆయనకు నాలుగేళ్లు పట్టింది. ఏపీ సీఐడీ తనను కొట్టిందని గతంలో సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారాయన. ఇలా రఘురామ మొదటి నుంచి వైసీపీ దూరంగానే ఉన్నారు.. టీడీపీ అనుకూలంగా ఉన్నారు. నరసాపురం నుంచి రానున్న ఎన్నికల్లోనూ ఎంపీ టికెట్ ఆశించారు. అయితే అనుకున్నది జరగలేదు. దీంతో రఘురామ డీప్‌గానే హర్ట్‌ అయ్యారు.

పార్టీ ప్రాథమిక సభ్యత్వం లేదు:

టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులో భాగంగా నరసాపురం సీటు బీజేపీకి వెళ్లింది. దీంతో బీజేపీ నుంచే తనకు టికెట్ వస్తుందని రఘురామ భావించారు. అయితే ఆయన వైసీపీకీ ఇప్పటికీ రాజీనామా చేయలేదు. అసలు బీజేపీ ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. అది జాతీయ పార్టీ. దాని విధానాలు వేరు ఉంటాయి. పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా లేకుండా రఘురామకు బీజేపీ టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉండదు. అయినా బీజేపీ తనకే టికెట్ ఇస్తుందని ధీమా వ్యక్తం చేసిన రఘురామను కమలం పార్టీ పట్టించుకోలేదు. భూపతిరాజు శ్రీనివాస్‌ వర్మకు నరసాపురం ఎంపీ టికెట్ కన్ఫార్మ్ చేసింది.

పోటి చేసేది నేనే:

బీజేపీ నుంచి టికెట్ రాకపోవడంతో రఘురామ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు పార్టీ ఇప్పటివరకు 13 లోక్‌సభ స్థానాలను ప్రకటించింది. పొత్తులో భాగంగా ఇంకా టీడీపీ నాలుగు ఎంపీ స్థానాలను ప్రకటించాల్సి ఉంది. అందులో విజయనగరం కూడా ఉంది. అక్కడ క్షత్రియ కులం ఓట్లు అధికంగా ఉన్నాయి. అందుకే రఘురామ అక్కడి నుంచి పోటి చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు రఘురామ మాత్రం నరసాపురం ఎంపీ సీటు తనదేనంటున్నారు. మరో కొన్ని రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ వస్తుందని మీడియాకు చెబుతున్నారు. అటు బీజేపీ నేత ఇప్పటికే తన ప్రచార పర్వాన్ని మొదలుపెట్టారు. అందులో జాతీయ పార్టీ కావడంతో ఒకసారి టికెట్ ఫిక్స్‌ చేసిన తర్వాత బీజేపీ బ్యాక్‌ స్టెప్‌ వేసే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. మరి చూడాలి నరసాపురం ఎంపీ టికెట్ కథ ఎలా ముగుస్తుందో!

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =