ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదోతరగతి ఫలితాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రభుత్వ వైఫల్యాలకు విద్యార్థులను ఫెయిల్ చేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. పదో తరగతి పరీక్ష తప్పిన పిల్లల మానసిక స్థితి, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, వారి విలువైన కాలం వృథా కాకుండా ఫెయిల్ అయిన వారికి 10 గ్రేస్ మార్కులను ఇవ్వాలని సూచించారు. ఆ తరువాత రీ కౌంటింగ్ ను, ఆపైన సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణను ఉచితంగా చేయాలని జనసేన పక్షాన, పిల్లల తల్లిదండ్రుల పక్షాన డిమాండ్ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పిల్లలు పరీక్షల్లో ఫెయిలైతే ఇంట్లో తల్లిదండ్రుల మార్గదర్శకం సరిగా లేదు అని నెపం వేస్తారని, ఆడపిల్లల మానమర్యాదలను నేరగాళ్లు భంగపరిస్తే తల్లుల పెంపకం సక్రమంగా లేదు అని సెలవిస్తున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. 2018, 19 సంవత్సరాలలో ఏపీలో పదోతరగతి ఫలితాలను పరిశీలిస్తే వరుసగా 94.48%, 94.88% శాతం ఉండగా, ఈ ఏడాదికి సంబంధించి విడుదలైన ఫలితాలలో 67.26% మంది మాత్రమే ఉతీర్ణులయ్యారని అన్నారు. గత ఫలితాలతో పోలిస్తే ఇది అత్యల్ప ఉతీర్ణత అని, రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారని చెప్పారు. పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం పెట్టి పాఠశాలలకు రంగులేస్తున్నాం, ఇంగ్లీషులో పాఠాలు చెప్పేస్తాం అంటే సరిపోదన్నారు. నాడు-నేడు కోసం రూ.16వేల కోట్లు ఇచ్చామని చెప్పుకొన్నారని, ఆ వేల కోట్ల రూపాయలు ఎటుపోయాయి అనిపిస్తోందని, ఈ ఫలితాలు చూస్తే ముందుగా తగినంతమంది బోధన సిబ్బందిని నియమించాలని అన్నారు. అరకొర ఉన్న ఉపాధ్యాయులకు మద్యం షాపులు దగ్గర క్యూ లైన్ల నిర్వహణకు డ్యూటీ వేసిన ఈ ప్రభుత్వం నుంచి ఏం ఆశించాలి? అని పవన్ కళ్యాణ్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY