‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై వర్క్‌షాప్‌.. ఈసారి 175 సీట్లూ గెలవాలని నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం

CM YS Jagan Held Review on Gadapa Gadapaku Mana Prabhutvam Program Workshop, AP CM YS Jagan Held Review on Gadapa Gadapaku Mana Prabhutvam Program Workshop, YS Jagan Held Review on Gadapa Gadapaku Mana Prabhutvam Program Workshop, AP CM Held Review on Gadapa Gadapaku Mana Prabhutvam Program Workshop, Review on Gadapa Gadapaku Mana Prabhutvam Program Workshop, Gadapa Gadapaku Mana Prabhutvam Program Workshop, Workshop on Gadapa Gadapaku Mana Prabuthavam, CM YS Jagan To Hold Key Meeting On YSRCP Gadapa Gadapaku Program Workshop, Gadapa Gadapaku Mana Prabhutvam Program, Gadapa Gadapaku Mana Prabhutvam Program News, Gadapa Gadapaku Mana Prabhutvam Program Latest News, Gadapa Gadapaku Mana Prabhutvam Program Latest Updates, Gadapa Gadapaku Mana Prabhutvam Program Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై బుధవారం వర్క్‌షాప్‌ ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, రీజనల్ కో ఆర్డినేటర్స్, మరియు జిల్లాల అధ్యక్షులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ వర్క్‌షాపులో ప్రసంగిస్తూ.. గడపగడపకూ అనేది నిరంతరాయంగా జరిగే కార్యక్రమమని, 8 నెలల పాటు దీనిని నిర్వహించేలా ప్లాన్ చేశామని పేర్కొన్నారు. ఒక్కో సచివాలయానికి రెండు రోజులపాటు కేటాయిస్తూ.. నెలకు 20 రోజుల చొప్పున 10 సచివాలయాల్లో ఇది జరిగేలా చూడాలని సీఎం సూచించారు.

అనంతరం దీనిపై ప్రజల నుంచి వస్తున్న స్పందనపై ఈ వర్క్‌షాపులో చర్చిస్తామని, ప్రజాప్రతినిధుల నుంచి ఈ వర్క్‌షాపుల్లో సూచనలు, సలహాలు తీసుకుంటామని జగన్‌ తెలిపారు. ఇక గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చాయని, దీనితో సంతృప్తి చెందకూడదని, ఈసారి ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లూ సాధించాలని నేతలకు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 87% కుటుంబాలకు మన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చేరాయని, మిగిలిన వర్గాలకు కూడా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి సచివాలయంలోనూ ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకూ దీనిని నిర్వహించాలని, తద్వారా ప్రజాప్రతినిధులందరూ ప్రజల మద్దతు పొందాలని సీఎం జగన్‌ సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + nine =