అన్న కాంటీన్లు మూసివేత?

anna canteen, anna canteen food, anna canteen food for 5 rs, Anna Canteens, anna canteens in ap, Anna Canteens To Be Closed, Anna Canteens To Be Closed From August 1st?, ap cm chandrababu, AP News, Ap Political News, AP Political Updates, Case Against YCP MLA’s Son, Mango News Telugu, telugu news, YCP Latest News, YCP MLA, YSRCP

గత తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్న కాంటీన్లు తాత్కాలికంగా మూతబడ్డాయి. జూలై 31 నాటికీ అన్ని జిల్లాలలో నడుస్తున్న అన్న కాంటీన్లలకు సంబంధిత నిర్వాహకులు తాళాలు వేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అన్ని పథకాలపై సమీక్షలు జరుపుతున్నారు. ఒక్కో అన్న కాంటీన్ ఏర్పాటుకు 40 లక్షలు ఖర్చు చేసారని, చాలా అవినీతీ జరిగిందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న 210 అన్న కాంటీన్లు జూలై 31 నుంచి మూతబడ్డాయి. రోజువారీగా భోజనం చేయడానికి వచ్చే ప్రజలు, కాంటీన్లు మూతపడి ఉండడంతో వెనుతిరుగుతున్నారు.

అయితే కాంటీన్లలను పూర్తీ స్థాయిలో మూసేసే ఉద్దేశం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి, కొన్ని రోజులుగా అన్న కాంటీన్లలకు పసుపు రంగు తీసేసి, తెలుపురంగు వేస్తున్నారు. అంతే కాకుండా ఇప్పుడు నడుస్తున్న సేవలు కొన్ని రోజులపాటు ఆపాలని, ఆహారాన్ని సరఫరా చేసే అక్షయపాత్ర ఫౌండేషన్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జరుగుతున్న పరిణామాలను బట్టి సరి కొత్త పేరుతో, కొన్ని చోట్ల ప్రదేశాలు మార్పుతో కొంత కాలం తరువాత మళ్ళీ కాంటీన్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. మరో వైపు ఆకలికి రాజకీయం తెలియదు ముఖ్యమంత్రిగారూ! మా మీద కక్ష సాధించడానికి పేదవాళ్ల కడుపు కొట్టాలా? అని నారా లోకేష్ అన్న కాంటీన్లు విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

 

[subscribe]
[youtube_video videoid=fP3WP9eOf_E]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 13 =