ఇటీవల విశాఖ పర్యటనకు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో విశాఖలో తూర్పు నౌకాదళ స్థావరంలోని ఐఎన్ఎస్ చోళలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తాజాగా ప్రధానితో భేటీ ఫొటోను షేర్ చేస్తూ, ప్రధానిని ప్రశంసిస్తూ పలు ట్వీట్స్ చేశారు. ప్రతి కఠిన పరిస్థితినీ ఉక్కు సంకల్పంతో ఎదుర్కొనే నాయకత్వ పటిమగల పురోగమనశీలి ప్రధాని నరేంద్ర మోదీ అని పవన్ కళ్యాణ్ కొనియాడారు.
‘ఎంత ఎత్తుకు ఎదుగుతాడో మనిషి ఈ కఠిన ధరిత్రి మీద..అంత దీర్ఘంగా పడుతుంది చరిత్రలో అతని నీడ’- అని శేషేంద్ర చెప్పిన ఈ కవితా పంక్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్థానానికి అద్దంపడతాయని పవన్ కళ్యాణ్ అన్నారు. “క్లిష్ట సమయంలో పాలన చేపట్టి- ప్రాంతీయవాదాలు, సాంస్కృతిక వైరుధ్యాలు. అన్నింటినీ అర్థం చేసుకొని సమాదరించి ప్రతి ఒక్కరిలో భారతీయులం అనే భావన నింపారు. ప్రజారోగ్యానికి వాటిల్లిన విపత్తు, దేశ భద్రతకు పొంచి ఉన్న ముప్పు నుంచి రక్షణకు అహరహం తపించారు. ప్రతి కఠిన పరిస్థితినీ ఉక్కు సంకల్పంతో ఎదుర్కొనే నాయకత్వ పటిమగల పురోగమనశీలి నరేంద్ర మోదీ. ప్రధాని మోదీని ఎనిమిది సంవత్సరాల తరవాత మళ్ళీ కలిశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులను, సమస్యలను వివరించేందుకు అత్యంత విలువైన సమయాన్ని కేటాయించిన ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సమావేశాన్ని సమన్వయపరచిన ప్రధానమంత్రి కార్యాలయానికి ధన్యవాదాలు” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE





































