రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్ల అన్ని వివరాలనూ జన సైనికులు క్రోడీకరించాలి – పవన్ కళ్యాణ్

Actor Pawan Kalyan, Jagan allows suspense over next CS to build, Jana Sena Party gears up to repair road network, Janasena, Janasena Leaders Must Collect All Details Pertaining to Damaged Roads, Janasena Leaders Must Collect All Details Pertaining to Damaged Roads – Pawan Kalyan, JanaSena Party on Twitter, Janasena to continue to press for road repair, pawan kalyan, Pawan Kalyan expresses concern over condition of roads

రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లకు సంబంధించి అన్ని వివరాలనూ జన సైనికులు క్రోడీకరించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి రోడ్డూ బాగుపడే వరకూ జనసేన గళమెత్తుతుందని చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “రాష్ట్రంలో రహదారులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో జనసేన నాయకులు, శ్రేణులు ఏకబిగిన సామాజిక మాధ్యమాల్లో వెల్లడిస్తేనే వైసీపీ ప్రభుత్వం కళ్ళు తెరచి రోడ్ల మరమ్మతులు, నిర్మాణంపై ఆలోచన మొదలుపెట్టింది. లక్షల మంది రహదారి కష్టాలను చెప్పారు. వర్షాలు తగ్గాక అక్టోబర్ తరవాత రోడ్డు మరమ్మతుల ప్రక్రియ మొదలుపెడతామని వైసీపీ ప్రభుత్వం వెల్లడించింది. అప్పుడు టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్లను నిర్ణయించి పనులు మొదలుపెట్టాలంటే సంక్రాంతి వస్తుంది. ఇక పనులెప్పుడు పూర్తవుతాయో? అప్పటి వరకూ ప్రజలకు ఈ గోతుల రోడ్ల గతి కావచ్చు. ఇప్పటి వరకూ రోడ్లపై ఈ ప్రభుత్వానికి ఎలాంటి దృష్టి లేదు. నిజంగా శ్రద్ధ ఉంటే వర్షాకాలం ముగిసిన వెంటనే పనులు మొదలయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసేవారు” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

“ప్రతి జనసేన నాయకుడు, జనసైనికుడు తమ పరిధిలోని రోడ్లకు సంబంధించిన అన్ని వివరాలను క్రోడీకరించుకొని సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నాను. ఏ రోడ్డు ఎన్ని కిలో మీటర్ల మేర దెబ్బ తిని ఉంది, మరమ్మతులతో బాగు చేయవచ్చా, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలా లాంటి వివరాలను సేకరించండి. ప్రభుత్వం చెప్పిన విధంగా అక్టోబర్ తరవాత మీ పరిధిలోని రోడ్డుకు మోక్షం కలుగుతుందో లేదో చూసేందుకు, అభివృద్ధి చేయాల్సిన రోడ్డును మరమ్మతులతో సరిపెట్టే పక్షంలో ప్రశ్నించేందుకు ఈ వివరాలు అవసరం. జనసేన నాయకులు, శ్రేణులు సిద్ధం చేసే ఈ వివరాలతో ప్రతి రోడ్డూ బాగుపడే వరకూ జనసేన పార్టీ గళమెత్తుతుంది” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ