జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శనివారం మధ్యాహ్నాం మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి మంగళగిరికి వెళ్లారు. రేపు (అక్టోబర్ 30, ఆదివారం) మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ పీఏసీ సమావేశానికి హాజరుకావడంతో పాటుగా, రెండు రోజులపాటుగా పలు పార్టీ కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొననున్నారు.
జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరగనున్న పీఏసీ సమావేశంలో ఇటీవల విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా వైసీపీ ప్రభుత్వం అనుసరించిన వ్యవహార తీరు, అక్కడ చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించనున్నట్టు జనసేన పార్టీ ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE






































