వైఎస్సార్ విగ్రహం ఆవిష్కరించిన సీఎం జగన్

AP CM YS Jagan Inaugurates YSR Statue In Vijayawada, Ap Political Live Updates, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Chief Minister of Andhra Pradesh, CM YS Jagan Unveils Statue of YS Rajasekhara Reddy, YS Jagan Unveils Statue of YS Rajasekhara Reddy, YS Jagan Unveils Statue of YS Rajasekhara Reddy In Vijayawada, YS Jagan Unveils Statue of YSR, YS Jagan Unveils Statue of YSR In Vijayawada

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 2 సోమవారం నాడు విజయవాడ నగరంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలో దివంగత నాయకుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గతంలో పుష్కరాల సమయంలో టీడీపీ ప్రభుత్వం తొలిగించిన వైఎస్సార్‌ విగ్రహాన్నీ తిరిగి అదే ప్రదేశంలో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ పునః ప్రతిష్టించారు. అలాగే పోలీస్ కంట్రోల్ రూం సమీపంలో ఉన్న ప్రగతి పార్క్ ను డాక్టర్ వైఎస్సార్ పార్క్ గా నామకరణం చేసారు. ఈ విగ్రావిష్కరణకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమం సందర్భంగా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

2016 జులై 31న అప్పటి టీడీపీ ప్రభుత్వం, కృష్ణ పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలిగించగా, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మునిసిపల్ విభాగం నుంచి పూర్తి అనుమతులతో విగ్రహాన్ని పునః ప్రతిష్ట చేసారు. ముఖ్యమంత్రి జగన్ తో పాటు బొత్స సత్యనారాయణ, ఇతర రాష్ట్ర మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

[subscribe]
[youtube_video videoid=wjdJ0fjxsxU]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + fourteen =