టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నిత్యం జరుగుతూనే ఉంటుంది. సమయం దొరికనప్పుడల్లా వాళ్లు వీళ్లపైన.. వీళ్లు వాళ్లపైన బుసలుకక్కుతుంటారు. నిప్పులు చెరుగుతుంటారు. తప్పులను ఎత్తి చూపుతూ కాంట్రవర్సీ కామెంట్లు చేస్తుంటారు. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని గురించి అయితే చెప్పనక్కర్లేదు. మీడియా ముందు కూడా పచ్చిగా మాట్లాడుతుంటారు. రెండు సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి.. ఆ తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి టీడీపీ నేతలే టార్గెట్‌గా విమర్శల బాణాలు వదులుతున్నారు.
ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో చంద్రబాబు ఆస్తుల చిట్టా విప్పారు కొడాలి నాని. బాబుకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి.. అందులో వైట్ ఎంత.. బ్లాక్ ఎంత అనే లెక్కలు చెప్పారు. లక్షల కోట్లకు అధిపతి చంద్రబాబు నాయుడు అని కొడాలి నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వద్ద ఇరవై వేల కోట్ల రూపాలయ వైట్ మనీ ఉందని.. డెభై వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఉందని వివరాలు బయటపెట్టారు. అంతేకాకుండా అమరావతి, కొండాపూర్, సింగపూర్, దుబాయ్‌లలో కూడా చంద్రబాబుకు లక్షల కోట్లు విలువ చేసే ప్రాపర్టీస్ ఉన్నాయని కొడాలి నాని చెప్పుకొచ్చారు.
తమ కంపెనీ హెరిటేజ్‌లో రెండు శాతం షేర్లను విక్రయిస్తే నాలుగు వందల కోట్లు వస్తాయని నారా భువనేశ్వరి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కూడా స్పందించిన కొడాలి.. చంద్రబాబు వైట్ మనీని మాత్రమే భువనేశ్వరి బయటపెట్టారని చెప్పుకొచ్చారు. బయటకు చెప్పని బ్లాక్ మనీ లక్షల కోట్ల రూపాయలు బాబు వద్ద ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు ఒక అపర కుబేరుడు అని కొడాలి వ్యాఖ్యానించారు. ఒకప్పుడు కేవలం రెండెకరాల ఆసామి అయిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లకు ఎలా అధిపతి అయ్యారో చెప్పాలని నిలదీశారు. ప్రజలందరూ దీనిపై ప్రశ్నించాలని సూచించారు.
అలాగే వినేవాడు ఉంటే.. ఇంగ్లీష్‌లో కూడా చంద్రబాబు హరికథలు చెబుతారని కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు ఎంతటి నిజాయితీ పరుడో ప్రజలకు ఇప్పుడు అర్థమయిందన్నారు. ఆయన చేసిన పాపం ఇప్పుడు పండిందని.. అందుకే జైలులో ఊసలు లెక్కపెడుతున్నారని వ్యాఖ్యానించారు. కోర్టులు కూడా చంద్రబాబు తప్పు చేశారని నమ్మాయి కాబట్టే.. బెయిల్ పిటిషన్లను కొట్టిపారేశాయని చెప్పారు. ఆయన తరుపున న్యాయవాదులు కూడా చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని అనడం లేదన్న కొడాలి.. కేవలం టెక్నికల్ రీజన్స్ పట్టుకొని మాత్రమే వాదిస్తున్నారని వ్యాఖ్యానించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ