పెళ్లి ఎందుకు చేసుకోలేదో చెప్పిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్

Rahul Gandhi Reaction on His Marriage,Rahul Gandhi Reaction,Rahul Gandhi on His Marriage,Mango News,Mango News Telugu,Rahul Gandhi, Rahul Gandhi Comments, Rahul Gandhi Marriage, Rahul Gandhi Reaction, Sonia Gandhi,Rahul Gandhi Marriage,Congress Leader Rahul Gandhi,Rahul Gandhi Latest News,Rahul Gandhi Latest Updates,Rahul Gandhi Live News,Rahul Gandhi Reaction News Today
Rahul gandhi

దేశ రాజకీయాల్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరంటే.. అందరూ టక్కున చెప్పే పేరు రాహుల్ గాంధీ. 53 ఏళ్ల వయస్సు వచ్చినప్పటికీ ఆయన ఇంకా పెళ్లి చేసుకోలేదు. పైగా రోజురోజుకు మరింత యంగ్‌గా తయారవుతున్నారు. యువకులకే పోటీనిస్తున్నారు. అంత వయస్సులో కూడా ఆయన స్టమినా చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఇటీవల కన్యాకుమరి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టి ఔరా అనిపించారు. ఇక నిత్యం రాహుల్ గాంధీకి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరలవుతుంటుంది. అదే ఆయన పెళ్లి న్యూస్.

రాహుల్ గాంధీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు?.. త్వరలో రాహుల్ గాంధీ వివాహం?.. రాహుల్ గాంధీ పెళ్లిపై స్పందించిన సోనియా గాంధీ.. ఇటువంటి టైటిల్స్‌తో నిత్యం సోషల్ మీడియా షేక్ అవుతూనే ఉంటుంది. ఇటీవల హర్యానాకు చెందిన మహిళా రైతులను రాహుల్ గాంధీ ఢిల్లీలోని తన ఇంటికి ఆహ్వానించారు. ఆ సమయంలో కూడా కొందరు మహిళలు రాహుల్ గాంధీ పెళ్లిపై.. సోనియా గాంధీని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి ఇంకా ఎప్పుడు పెళ్లి చేస్తారని అడిగారు. ఆ సమయంలో సోనియా గాంధీ నవ్వుతూ.. మీరే ఓ అమ్మాయిని చూడండి అని సమాధానం ఇచ్చింది. ఇలా రాహుల్ గాంధీ పెళ్లిపై సోషల్ మీడియాలో నిత్యం హాట్ హాట్‌గా చర్చ జరుగుతూనే ఉంటుంది.

ఇక కొద్దిరోజులుగా రాహుల్ గాంధీ అన్ని వర్గాల వారితో సమావేశమవుతూ వస్తున్నారు. రైతులు, కూలీలు, మెకానిక్‌లు, డ్రైవర్లు, వడ్రంగి కార్మికులు, రైల్వే కూలీలు.. ఇలా అందరి వద్దకు రాహుల్ గాంధీ స్వయంగా వెళ్లి కలుస్తున్నారు. వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఇలానే ఇటీవల రాజస్థాన్‌ జైపూర్‌లోని మహారాణి కాలేజ్ స్టూడెంట్స్‌తో రాహుల్ గాంధీ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు రాహుల్ గాంధీని పొగడ్తలతో ముంచెత్తారు. కొందరు విద్యార్థినులు మీరు చాలా అందంగా ఉన్నారంటూ.. రాహుల్‌కు కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇంత యాక్టివ్‌గా ఉన్న మీరు ఎందుకు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదని ప్రశ్నించారు. అందుకు రాహుల్ గాంధీ.. తాను పూర్తిగా కాంగ్రెస్‌లో చిక్కుకుపోవడం వల్లే పెళ్లి చేసుకోలేదని సమాధానం ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

అయితే రాహుల్ గాంధీకి ఉన్న పెద్ద కోరిక ప్రధాని కావడం. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ రాహుల్ గాంధీ కోరికలు మాత్రం తీరడం లేదు. 2014 కంటే ముందు సెంట్రల్‌లో యూపీఏ రెండు సార్లు గెలుపొంది చక్రం తిప్పుతోంది. అప్పుడు సరైన ప్రతిపక్షం కూడా లేకపోవడంతో.. సెంట్రల్‌లో మరోసారి కూడా యూపీఏనే వస్తుందని అంతా భావించారు. నెక్స్ట్ ప్రధాని రాహుల్ గాంధీనే అని అందరూ అనుకున్నారు. ఆ సమయంలోనే పదవి వచ్చాక పెళ్లి చేసుకోవాలని రాహుల్ గాంధీ అనుకున్నారట.

కానీ అక్కడే బిగ్ షాక్ తగిలింది. ఎవరూ ఊహించని విధంగా బీజేపీ ఫామ్‌లోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ ఎంట్రీతో బీజేపీకి వెయ్యి ఏనుగుల బలం చేకూరినట్లు అయింది. దీంతో 2014 ఎన్నికల్లో యూపీఏను ఓడించి బీజేపీ గెలుపొందింది. అలా బీజేపీ అధికారంలోకి రావడంతో రాహుల్ గాంధీ ప్రధాని కళ, పెళ్లి కోరిక అన్నీ చెల్లాచెదురయిపోయాయి.మరి ఈసారి అయినా రాహుల్ గాంధీ కోరిక నెరవేరుతుందా?.. ప్రధాని పదవి చేపడుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 9 =