జగన్ అక్రమ ఆస్తుల కేసు విచారణ డిసెంబర్ 6 కి వాయిదా

Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Jagan Illicit Assets Case, Jagan Illicit Assets Case Hearing, Jagan Illicit Assets Case Hearing Adjourned To December, Jagan Illicit Assets Case Hearing Adjourned To December 6th, Jagans Illicit Assets Case Hearing Adjourned To December 6th, Mango News Telugu

వైసీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి నవంబర్ 22, శుక్రవారం నాడు నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో సమర్పించిన మొత్తం 11 చార్జిషీటులపై విచారణ జరిపిన న్యాయస్థానం, తదుపరి విచారణను డిసెంబర్ 6 కి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి, ఇతరులు ఈ రోజు విచారణకు హాజరు కాలేదు, కేవలం ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ మాత్రమే హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి కచ్చితంగా కోర్టుకు హాజరుకావాల్సిందేనని, వ్యక్తిగత హాజరు నుంచి వైఎస్ జగన్ కు మినహాయింపు ఇవ్వడం కుదరదని 15 రోజుల క్రితం సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. అయితే, ముఖ్యమంత్రిగా అధికారిక పర్యటనల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో వైఎస్ జగన్ విచారణకు హాజరు కాలేరంటూ ఆయన తరుపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. దీంతో తదుపరి విచారణను కోర్టు డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =