మంగళగిరి సమీపంలోని ఖాజ టోల్‌ప్లాజా వద్ద భారీ అగ్ని ప్రమాదం

Major Fire Accident at Kaza Toll Plaza Near Mangalagiri

గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఖాజా టోల్ ప్లాజా వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టోల్ ప్లాజా వద్ద లారీని ఆపి టోల్ ఫీ చెల్లిస్తున్న సమయంలో లారీ టైర్ పగిలిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు తెలుస్తుంది. కొద్దిసేపట్లోనే క్యాష్ కౌంటర్లకు కూడా మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన టోల్‌ప్లాజా సిబ్బంది, లారీ డ్రైవర్ అక్కడి నుంచి పక్కకు పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది టోల్ ప్లాజా వద్దకు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, కాగా లారీ పూర్తిగా దగ్దమైనట్టు తెలుస్తుంది. మరోవైపు టోల్ ప్లాజా వద్ద మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాక వాహనాల రాకపోకలను యథావిథిగా అనుమతిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ